వాయిదాల పర్వం…

సేమ్ సీన్ రిపీట్. పార్లమెంటు సమావేశం ప్రారంభం కావడం, విపక్షాలు ఆందోళన చేయడం. సభ వాయిదా పడటం. నిత్యకృత్యమైంది. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ఏపీ ఎంపీలు, తెలంగాణ రిజర్వేషన్ బిల్లుపై టీఆర్ఎస్, వివిధ సమస్యలపై అనేక రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ఆందోళనలు చేస్తున్నారు. ఫలితంగా ఒక్క రోజు సభ సజావుగా సాగక ముందే వాయిదా పడుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. సభా కార్యకలాపాలను వాయిదా వేసి ప్రత్యేక హోదాపై సమగ్రంగా సభలో చర్చించాలని వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు. ఈ మేరకు వాయిదా తీర్మానం ఇచ్చారు. అసలు ఈ అంశంపై చర్చ జరిగితేనే వాస్తవాలు బయటకు వచ్చే వీలుంది. 
పట్టించుకోని కేంద్రం…
ఎవరు ఎన్ని ఆందోళనలు చేసినా కేంద్రం గుండె కరగడం లేదు. మరింత కరకుగా మారుతోంది. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పింది. నిన్న రైల్వే జోన్ కు మంగళం పాడింది. రైల్వే జోన్ ఇస్తే ఒరిగే ప్రయోజనం ఏంటి.. ప్రత్యేక మేనేజర్ కూర్చోవడం తప్ప అంటోంది. అదైనా ఇస్తారా అంటే అదీ లేదు. మొత్తంగా కేంద్రం ఇంకా నాటకాలు ఆడుతూనే ఉంది. ఇంకోవైపు టీడీపీ దూకుడు పెంచింది. బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ అసలు సిసలు రాజకీయానికి ఇంకా తెరపడలేదు. రాజ్యసభ ఎన్నికలకు ముగ్గురే నామినేషన్లు వేయడంతో దాదాపు ఏకగ్రీవం అయ్యే అవకాశముంది. ఆ తర్వాత కమలం పార్టీ పని పట్టేలా వ్యూహ రచన చేస్తున్నారు చంద్రబాబు. హోదా విషయంలో వెనక్కు తగ్గేది లేదనిచెబుతున్నారాయన. మిగతా రాష్ట్రాలను చూసినట్లు చూడటం లేదంటున్నారు. అదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారు నేతలు. 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*