హరీష్ రావును ఢిల్లీకి తీసుకెళుతున్న కేసీఆర్

2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ సిఎం. ఆ విషయాన్ని తెలంగాణ సిఎం కేసీఆర్ చెప్పారు. తాను జాతీయ రాజకీయాల్లో ఉంటే..తెలంగాణలో నేతలు కేటీఆర్ కు సహకరిస్తారా అనే అనుమానం వచ్చింది. అందుకే హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరావు, కడియం శ్రీహరి వంటి వారిని హస్తినకు తీసుకెళతారట. ఈ మేరకు హరీష్ రావును బుజ్జిగించినట్లు తెలుస్తోంది. ఇందుకు వారు సుముఖంగా లేరంటున్నారు. కేటీఆర్ కు ఇబ్బంది కలిగించే ఆలోచన చేయనని హరీష్ రావు నెత్తి నోరు బాదుకుంటున్నా..అసలు మీరు ఇక్కడ ఎందుకు. ఢిల్లీకి పద అంటున్నారట కేసీఆర్. ఫలితంగా హరీష్ రావు తిరుగుబాటు చేయవచ్చనే సంకేతాలు అందుతున్నాయి. గులాబీ పార్టీలో ఇప్పుడు నివురు గప్పిన నిప్పులా రాజకీయం సాగుతోంది. ఎప్పుడైనా బద్దలు కావచ్చంటున్నారు. కేసీఆర్ తీరే ఇందుకు కారణం. తన కుమారుడు కేటీఆర్ కోసం ఏకంగా సచివాలయం కొత్తది కట్టించే ఆలోచన చేస్తున్నారు కేసీఆర్. కానీ అది కలిసి రావడం లేదట. ఆల్రెడీ కేసీఆర్ కు బ్యాడ్ టైమ్ మొదలైనట్లు జ్యోతిష్యులు చెబుతున్నారు. ఫలితంగా కేసీఆర్ కు ఇబ్బందులు వస్తాయంటున్నారు. 
                                 తెలంగాణకు కాబోయే సిఎం హరీష్ రావు అనే చర్చ సాగుతోంది. ముప్పై మంది వరకు ఎమ్మెల్యేలు హరీష్ తో ముందుకు సాగేందుకు సిద్దంగా ఉన్నారంటున్నారు. అదే జరిగితే కేసీఆర్ కొంప కొల్లేరు అవుతోంది. మరోవైపు కేసీఆర్ ఆరోగ్యం సహకరించడం లేదంటున్నారు. అందుకే తిరుగుబాటు తప్పదంటున్నారు. తాను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకునేది లేదని హరీష్ రావు ఖండనలు ఇచ్చారు. అయినా సరే వాటిని నమ్మడం లేదు కేసీఆర్. ఇప్పటికే హరీష్ రావు ఎవరితో మాట్లాడుతున్నారు. ఏం చేస్తున్నారు. వాస్తవ పరిస్థితి ఏంటనే విషయం పై కూపీ లాగుతున్నారు కేసీఆర్. అందుకే తన మేల్లుడుని వీలున్నంత వరకు దూరంగా పెట్టే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*