చంద్రబాబు వ్యూహానికి బీజేపీ ప్రతిస్పందన

ఏపీకి హోదా విషయంలో చంద్రబాబు తీరు బీజేపీని ఇరుకున పెడుతోంది. అసలు ఏపీలో బీజేపీ చెప్పుకోలేని పరిస్థితుల్లో పడింది. రైల్వే జోన్ అంశం వారికి కొరుకుడు పడని అంశంగా మారింది. జోన్ లేదు. హోదా లేదు. ప్యాకేజి లేదు. మేము ఇచ్చేది లేదని చెప్పింది కేంద్రం. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ విషయంలో ఇలానే మాట్లాడారు. తెలంగాణకు నిధులు ఇచ్చేది లేదు మీకు చేతనైంది చేసుకోపోండి అని అన్నారు. అదే తెలంగాణను మరింత ఏకతాటి మీదకు తీసుకువచ్చేలా చేసింది. ఫలితం.. తెలంగాణ సాధన. ఇప్పుడు బీజేపీ తీరు అలానే ఉంది. మేము ఇచ్చేది లేదు. మీకు చేతనైంది చేసుకోపో అనేలా వ్యవహరిస్తోంది. ఫలితంగా జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. 
ఎన్డీఏలోనే కొనసాగుతున్నారు చంద్రబాబు. కానీ బలవంతంగా వారిని బయటకు పంపేలా వ్యవహరిస్తోంది బీజేపీ. చంద్రబాబు కేసులతో పాటు.. నిధుల విషయంలో జరిగిన లెక్కలపై నిగ్గుతేల్చే పని చేయనుంది. అందుకు కొందరు నేతలను రంగంలోకి దించారు. పురందేశ్వరి, కన్నా, సోము వీర్రాజుతో పాటు.. తాజాగా మాణిక్యాలరావులు తెరపైకి వచ్చారు. వారు చేసిది ఒక్కటే. ఎవరు ఎక్కువగా చంద్రబాబును తిడితే వారికి పదవి ఇస్తారట. బీజేపీలో చాలా సెటైర్ గా సాగుతున్న సంవాదన ఇది. 
మరోవైపు చంద్రబాబు హోదా విషయంలో బీజేపీ తీరును వ్యతిరేకిస్తున్నారు. ప్రజలతో కలిసి పోరాటం చేసేందుకు సిద్దమవుతున్నారు. హోదా విషయంలో పోరాటం చేస్తామన్న పవన్ చేతులెత్తేయడంతో వైకాపా నామ మాత్ర తీర్మానాన్ని పెడుతున్న సంగతి తెలిసిందే. బీజేపీతో లోపాయికారిగా మంతనాలు చేస్తూ పైకి మాత్రం ఆ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం పెడుతోంది. అందుకే పవన్ కల్యాణ్ ఆ పార్టీని నమ్మడం లేదు. మరోవైపు తన మకాంను ఏపీకి మారుస్తున్న పవన్ కల్యాణ్… అక్కడే ఇళ్లు కట్టుకుంటున్న సంగతి తెలిసిందే. 
మరోవైపు చంద్రబాబు తన మాటల దాడిని పెంచారు. ఇందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. ”రాష్ట్రం కోసం రాత్రింబవళ్లు కష్టపడతాం.. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం. ఆ అనుభవం నాకుంది. కష్టపడే తత్వం ప్రజలకుంది. కానీ హక్కుల విషయంలో బీజేపీ అప్పుడో రకంగా ఇప్పుడో రకంగా మాట్లాడుతూ.. న్యాయం చేయాల్సింది పోయి ఎదురు దాడి చేయడం ఎంత వరకు న్యాయమో ఆలోచించుకోవాలి.” అంటూ మరో ట్వీట్ చేసారు…

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*