కాంగ్రెస్ పై వేటు వేశారు…

నిన్న కాంగ్రెస్ సభలో వ్యూహాత్మకంగా గోల చేసింది. నేడు స్పీకర్ మధుసూధనాచారి అంతే తెలివిగా వేటు వేశారు. ఫలితంగా ఎవరికి వారే పై చేయి సాధించే ఆలోచన చేయడం హాట్ టాపికైంది. శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌పై నిన్న అసెంబ్లీలో జరిగిన దాడిపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఆ ఘటనకు బాధ్యులుగా చేస్తూ 11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను శాసనసభాపతి మధుసూదనాచారి సస్పెండ్‌ చేశారు. సిల్పీ నేత జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, చిన్నారెడ్డి, డీకే అరుణ, పద్మావతి, టి.రామ్మోహన్‌రెడ్డి, డి.మాధవరెడ్డి, వంశీచంద్‌ ల పై సస్పెన్షన్‌ వేటు వేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వాలు రద్దు చేయడం కలకలం రేపుతోంది. ఈ బడ్జెట్‌ సమావేశాలు ముగిసేవరకూ బహిష్కరణ ఉంటుందని స్పీకర్‌ చెప్పడం మరింత ఆసక్తికరం. 
మండలి ఛైర్మన్‌పై జరిగిన దాడి చూసి తాను షాక్‌కు గురయ్యానని స్పీకర్ మధుసూధనాచారి అన్నారు. నాలుగేళ్ల తర్వాత తెలంగాణ శాసనసభ చరిత్రలో ఇలాంటి ఘటన జరగడం పట్ల బాధను వ్యక్తం చేశారాయన. కాంగ్రెస్‌ సభ్యులను సస్పెండ్‌ చేయాలని మంత్రి హరీష్ రావు తీర్మానం ప్రవేశ పెట్టగా…స్పీకర్ ఆమోదం తెలిపారు. 
అసలు మండలి ఛైర్మన్ గాయం అయినట్లు చూపిస్తే నేను క్షమాపణలు చెప్పి ఎమ్మెల్యే పదవినే వదులుకుంటానని సవాల్ విసిరారు మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. టీఆర్ఎస్ మీద దూకుడుగా వ్యవహరిస్తున్నారు కోమటిరెడ్డి రెడ్డి. సంపత్ కుమార్ లు. అందుకే వారిద్దరినీ బయటకు పంపారు. స్వామి గౌడ్ కంటికి దెబ్బ తగిలినా..చాలా స్వేచ్ఛగా మీడియా ముందు అరుస్తూ మాట్లాడటం అనుమానాలకు తావిస్తోంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ మీడియా ముందు చెబుతోంది. దెబ్బ తగిలిందని హెడ్ పోన్స్ విసిరిన 17 నిమిషాల తర్వాత స్వామి గౌడ్ ను కూర్చో పెట్టారు. ఇది కావాలనే చేశారా..మరొకటినా అనేది తేలాల్సి ఉంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*