అఖిల ప్రియను మగాడిలా పెంచారట

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో భూమానాగిరెడ్డి తొలి వర్థంతి ఘనంగా జరిగింది. భూమా కుమార్తె, ఏపీ మంత్రి అఖిల ప్రియ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడారు అఖిల ప్రియ. మంత్రులు కాల్వ శ్రీనివాసులు, ఆదినారాయణ రెడ్డి పక్కనే ఉండగా అఖిల జూలు విప్పిన సింహంలా చెలరేగి పోయిన తీరు చూసి టీడీపీ నేతలే ఆశ్చర్యపోయారు. గుంట నక్కలన్నీ ఒక చోటికి చేరాయి. ఆళ్లగడ్డని పీక్కొని తినాలని చూస్తున్నాయి. భూమా నాగిరెడ్డి తన నియోజకవర్గంలో మగపిల్లల్ని ఎలా పెంచారో ఆడపిల్లల్నీ సమానంగా పెంచారు. తనను ఏడిపించేందుకు ప్రయత్నించినా తగ్గేది లేదన్నారు. మందు రాజకీయాలు చేసి భూమా వర్గాన్ని చీల్చాలని చూస్తున్నా ఫలించవన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డి మందు పార్టీలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దానికి వెళ్లొద్దని భూమా అఖిల ప్రియ వార్నింగ్ ఇచ్చినా నేతలు వెనక్కు తగ్గలేదు. 
భూమా ప్రధాన అనుచరుడు అయిన ఏవీ సుబ్బారెడ్డి ఇప్పుడు అఖిల ప్రియకు కొరకరాని కొయ్యగా మారాడు. అందుకే గట్టిగానే హెచ్చరికలు పంపింది. బెదిరింపులకు లొంగేవాళ్లు అసలు భూమా వర్గమే కాదని అఖిల ప్రియ అన్న వ్యాఖ్యలు కర్నూలు జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. భూమా ఆస్తులన్నీ ఏవీ సుబ్బారెడ్డి చేతిలో ఉన్నాయనే ప్రచారం ఉంది. వాటి విషయం అడిగితే తనకు తెలియదని సుబ్బారెడ్డి చెప్పారంటారు. ఆ విషయం బయటకు పొక్కలేదు. కానీ అంతర్గతంగా ఏవీ సుబ్బారెడ్డితో భూమా కుటుంబం ఇప్పుడు తెగదెంపులు చేసుకునేందుకు సిద్దమైంది. అందుకే చాలా కార్యక్రమాలకు ఆయన్ను దూరం పెడుతోంది. అయినా సరే నేతలు ఇరు వర్గాల వైపు వెళుతుండటంతో ఉత్కంఠ నెలుకుంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*