కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మందు కొట్టారా!

ఔరా.. ఇదేం చోధ్యం.. ఇదెక్క‌డి దౌర్భాగ్యం.. వందేళ్ల చ‌రిత్ర వున్న కాంగ్రెస్ పార్టీ నేత‌లు.. అదీ ఎమ్మెల్యేలు చుక్కేసి.. అసెంబ్లీకు వ‌చ్చార‌ట‌. మైకం దిగ‌క‌పోవ‌టంతో.. ఒక‌రిపై ఒక‌రు ప‌డుతూ నానా హంగామా చేశార‌ట‌. ఇదెక్క‌డో అయ‌తే మ‌న‌కెందుకు.. తెలంగాణ అసెంబ్లీలో ఇది జ‌రిగిందంటూ.. స్వ‌యంగా ప్ర‌భుత్వ విప్ పల్లా రాజేశ్వ‌రెడ్డి ప్ర‌క‌టించ‌టం చ‌ర్చ‌నీయాంశంగామారింది. తెలంగాణ‌లో అసెంబ్లీ స‌మావేశాలు సోమ‌వారం మొద‌ల‌య్యాయి. ముందుగా కేసీఆర్ చెప్పిన‌ట్లే.. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంపై కాంగ్రెస్ నేత‌లు మండిప‌డ్డారు. పైగా.. కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి బ‌ల‌మైన వ‌స్తువును గ‌వ‌ర్న‌ర్‌ పైకి విసిరారు.. కాలం క‌ల‌సిరావటంతో అది కాస్తా.. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ వెనుక‌నే ఉన్న శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ స్వామిగౌడ్ కంటికి తాకింది. క‌న్ను పూర్తిగా  దెబ్బ‌తినటంతో ఆయ‌న్ను హైద‌రాబాద్ స‌రోజ‌నీ దేవి అసుప‌త్రికి త‌ర‌లించారు. వైద్య‌ప‌రీక్ష‌లు చేసిన డాక్ట‌ర్లు ఇన్‌పేషెంట్‌గా జాయిన్ చేసుకున్నారు. ఇంత చేసిన కోమ‌టిరెడ్డి తాము చేసింది త‌ప్పేం కాదంటున్నారు. పైగా ఆసుప‌త్రిలో వున్న స్వామిగౌడ్‌ను ప‌రామ‌ర్శిస్తామంటున్నారు. దీనిపై టీఆర్ ఎస్ నేత‌లు గుర్రుగానే వున్నారు. శాస‌న‌స‌భ‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరు వ్య‌వ‌స్థ‌నే  అప‌హాస్యం చేసేదిగా ఉందంటూ విప్ , ఎమ్మెల్సీ ప‌ల్లా ఆందోళ‌న వెలిబుచ్చారు. మ‌ద్యం మ‌త్తులో ఉన్న ఎమ్మెల్యేలు ఒకానొక ద‌శ‌లో సీనియ‌ర్ నేత జానారెడ్డిపై తూలారంటూ ఆరోపించారు. దీన్ని భ‌రించ‌లేక‌నే జానారెడ్డి స‌భ మ‌ధ్య‌లో నుంచి వెళ్లిపోయారంటూ ఎద్దేవాచేశారు. ఇప్ప‌టికే కాంగ్రెస్ పోయిన ప‌రువు రాబ‌ట్టుకునేందుకు నానా తంటాలు ప‌డాల్సి వ‌స్తోంది. బ‌ల‌మైన బాహుబ‌లి కోసం వెతుకుతున్నారు. ఇటువంటి ప‌రిస్థితుల్లో ఆచితూచి స్పందించాల్సిన నేత‌లు.. ఇలా బ‌రితెగిస్తే.. పోయేది మా పార్టీ ప‌రువేనంటూ పాపం హ‌స్తం కార్య‌క‌ర్త‌లు ఆవేద‌న వ్య‌క్తంచేస్తున్నార‌ట‌.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*