విజయసాయి మాటలు జాతికే ప్రమాదకరం

తెలుగు దేశం పార్టీ ఎటు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి పక్కకు తప్పుకున్న ది గనుక, ఆ స్థానాన్ని తాము భర్తీ చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో అతిశయోక్తి లేదు. అసహజం కూడా కాదు. ముందు నుంచి వైయస్సార్ కాంగ్రెసు, కేంద్రంలోని భాజపా సర్కారుకు అంతో ఇంతో అనుకూలంగా మాత్రమే వ్యవహరిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంతో జట్టు కట్టడానికి ఆ పార్టీ మొగ్గు చూపుతుండటం దీనికి సంబంధించి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి చెప్పిన మాటలు చాలా ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి.

భారతీయ జనతా పార్టీపై తమకు నమ్మకం ఉన్నదని తాము ఖచ్చితంగా ఆ పార్టీతో కలిసి ముందుకు వెళతామని ఆ పార్టీ తప్పకుండా ప్రత్యేక హోదా ఇస్తుందని విజయసాయిరెడ్డి చెబుతున్నారు. నాలుగు సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ వైఖరి మీద తెలుగుదేశం కూడా ఇదే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. అలా అనడం కంటే భాజపా తెలుగుదేశాన్ని కూడా ఇదే మాయలో ఉంచిందని చెబితే సబబుగా ఉంటుంది. తెలుగుదేశం సత్యాన్ని గ్రహించిన వెంటనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ మాయలో పడడానికి తాము సిద్ధం అని సంకేతాలు ఇస్తోంది.

చూడబోతే జగన్ను విజయసాయిరెడ్డి తమ మీద ఉన్న సీబీఐ కేసుల విషయంలో ప్రత్యేక మినహాయింపులు పొందడానికి కాస్తా దయ ఉంటే కేసుల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందని ఇందు కోసం అర్రులు చాస్తున్న ట్లుగా మనకు అర్థమవుతోంది. దానివలన ముంచుకు వచ్చే ప్రమాదం ఏంటంటే… ఒకరు కాకపోతే మరొకరు, ఆంధ్రప్రదేశ్లో తమకు మద్దతు ఇచ్చే వారికి ఢోకా లేదు అనే అహంకారం కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి విపరీతంగా కలుగుతుంది. ఒకసారి ఆ అహంకారం బలిసింది అంటే కనుక ఇక వారి నుంచి రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలను సాధించడం అయినా సరే గదను అయిపోతుంది.

ఈ వాస్తవాన్ని గుర్తించి విజయసాయిరెడ్డి కాస్త ఉచితానుచితాలను గమనించి మాట్లాడితే బాగుంటుంది కానీ ఏకపక్షంగా భాజపా మీద నాకు నమ్మకం ఉంది మేం వారితోనే ఉంటాం వారికి మద్దతిస్తాం లాంటి డైలాగులు వేస్తే అది రాష్ట్రానికి తెలుగుజాతికి తెలుసుకోవాలి . ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అంటే రాష్ట్ర ప్రజలకు నమ్మకం పోయింది వారితో ఎగబడితే ఉన్న ఆరోపణలు వైయస్సార్ కాంగ్రెస్ మీద కూడా జనం నమ్మకం ఉందని పలువురు భావిస్తున్నారు.

1 Comment

  1. its natural for living beings to do any thing to keep their existence. The main fault lies with our election system.Unless our govt promulgate the constitutional amendment that those accused and having charge sheet filed shall not be contested in elections”,its waste of time to criticize such fellows.

Leave a Reply

Your email address will not be published.


*