హోదా పోరు ఘనత కోసం పోటీ పడుతున్న పార్టీలు

నిన్నటి దాకా హోదా పేరు ఎత్తితేనే బూతులా చూశారు సిఎం చంద్రబాబునాయుడు. హోదా కోసం ఆందోళనలు చేస్తే అరెస్టులు చేయించి లోపలేశారు. కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటున్నారు. మంత్రి పదవులకు రాజీనామా చేయించి ప్రజల్లో క్రెడిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నా…ఎవరికి వారే ఆ ఘనత మాదేనని చెప్పుకునేందుకు ప్రధాన పార్టీలు పోటీపడుతున్నాయి. హోదా అవసరమని ఒకసారి, అదేమైనా సంజీవినా అని మరోసారి, హోదా కంటే ప్యాకేజి మంచిదని ఇంకోసారి ఇలా రకరకాలుగా మాట్లాడారు చంద్రబాబు. అసలు హోదా సంగతి ప్రస్తావిస్తేనే ఊరుకునేవారు కాదు. ఇప్పుడు వాస్తవ పరిస్థితి తెలిసిందే. హోదా కోసం పోరాడుతుంది మేమే. వైకాపా నేతలు పార్లమెంటు బయటకు తిరుగుతున్నారనే ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు. ఫలితంగా హోదా కోసం తాము అంత చేశాం. ఇంత చేశామని ప్రజల్లో చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోంది. 
తొలి నుంచి హోదా కోసం పోరాడుతుంది వైకాపా. అందులో సందేహం లేదు. కానీ మధ్యలో ఆ పార్టీకి చిత్తశుద్ది లోపించింది. కాడి కింద పడేసింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీతో చేతులు కలిపింది. ఏపీకి బడ్జెట్లో ఏం కేటాయించక పోయినా బాగుందని విజయసాయిరెడ్డి లాంటి నేతలు కితాబునిచ్చారు. ప్రధాని మోడీ సభలో ఉంటే వైకాపా నేతలు బయట ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఈ నెల21న ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు. అది పార్లమెంటు సభలు ముగిసే సమయంలో. ఫలితంగా ఆ పార్టీకి చిత్తుశుద్ది ఉందా అనే అనుమానం వస్తోంది. హోదా కోసం పల్లె నుంచి పట్నం దాకా ఆందోళనలు చేసిన ఘనత వైకాపాదే. హస్తిన స్థాయిలోను ఆందోళనలు చేసింది. వైకాపా అధినేత జగన్ నిరసన దీక్షలు చేసారు. 
కానీ ఇప్పుడు టీడీపీకి అదే ఇబ్బందిగా మారింది. హోదా విషయంలో నాలుగేళ్లుగా మౌనం దాల్చి…ఇప్పుడు తాము పోరాడుతున్నామనే భావనను తీసుకువస్తోంది. ఫలింతగా మేమే ఎక్కువగా పోరాడుతున్నామని ఇరు పార్టీల నేతలు తన్నుకుంటున్నారు. ఎవరు ఏమన్నా..హోదా ఇచ్చేది లేదని చెబుతోంది మరోవైపు బీజేపీ. ఆసంగతి అర్థం చేసుకోవడం లేదు నేతలు. వారు కాదు నేను ముందుండి నడిపిస్తానంటూ ఉత్తర ప్రగల్భాలు పలికారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆచరణలో ఆ పని చేయలేక పోయారు. ఢిల్లీకి వెళ్లి మరీ అన్ని పార్టీల నేతలను కలుస్తానని చెప్పారు. సవాల్ విసిరారు. ఆనక చతికల పడ్డారు. ఒక మాట చెప్పడం. దానికి కట్టుబడక పోవడం పవన్ కల్యాణ్ కు వెన్నతో పెట్టిన విద్యలా మారింది.

1 Comment

  1. ప్రత్యేక హోదాకు బదులుగా, అంతే ప్రయోజనాలు కలిగించే ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని కేంద్ర ప్రభుత్వం నమ్మపలికితే, స్నేహాధర్మం పాటించి సహకరిస్తే, రాష్ట్రానికి భవిష్యత్తులో ప్రయోజనాలు మరికొన్ని సాధించవచ్చని కొంత అధికంగా ఆశపడి మొత్తానికి మోసపోయి, రాష్ట్రప్రభుత్వం ఇరుకునపడింది. అల్జీరియా దేశస్థులు, బీహార్ రాష్ట్రానికి చెందిన దొంగలు, దొంగ ఫోన్ నంబర్లు తో సామాన్యులను మోసంచేసి అకౌంట్లనుంచి డబ్బు డ్రా చేసుకుని మోసం చేస్తున్న విధంగానే కేంద్ర ప్రభుత్వం చేస్తుందని ఊహించలేకపోవడం చంద్రబాబు చేసిన తప్పు. మనదేశ కేంద్రప్రభుత్వం మనల్ని మోసం చేసినందుకు మనం తగిన బుద్ధి చెబుదాం. ఖంగారు పడవలసి అవసరం లేదు. B.J.P వాళ్లు ఓట్ల కోసం మన దగ్గరకే వస్తారు,చెప్పుతో కొట్టి నిలదీద్దాం.

Leave a Reply

Your email address will not be published.


*