సాయి పల్లవితో నా కొడుకు తిరగలేదన్న గంటా

గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లు ఉంది మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితి. తన కుమారుడు రవితేజపై సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. గంటా రవితేజ, హీరోయిన్‌ సాయిపల్లవిలు లవర్స్ గా మారారని..త్వరలో వారిద్దరు పెళ్లి చేసుకుంటున్నారనే ప్రచారం వచ్చింది. అటు రవితేజగానీ..ఇటు సాయి పల్లవిగానీ ఈ వార్తలను ఖండించలేదు. ఇక శృతి మించి వార్తలు రావడంతో ఇక మంత్రి గంటా రంగంలోకి దిగారు. తన కుమారుడు, సాయిపల్లవి మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి విషయాలపై సాధారణంగా స్పందించనన్నారు. కాకపోతే అవాస్తవమైన విషయాలను ప్రచారం చేస్తున్నప్పుడు ఖండించక పోతే ఇబ్బంది అని..అందుకే కాదంటున్నట్లు చెప్పారు. 
వాస్తవంగా సాయిపల్లవి, రవితేజ ఇద్దరు మంచి స్నేహితులుగా తిరుగుతున్నారని తెలుస్తోంది. రవితేజకు ఇంతకు ముందే వివాహం అయింది. అయినా సరే పుకార్లు ఎక్కువగా రావడంతో గంటా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. మంత్రి గంటా శ్రీనివాస్‌రావు కుమారుడు రవితేజ హీరోగా ‘జయదేవ్’ సినిమాను తీశారు. నటన చేతగాక పోవడంతో ఒక్క రోజులోనే తేలిపోయింది. కనీసం ఖర్చులు రాలేదు. తీవ్రమైన నష్టాలను మిగిల్చింది. ఆ సినిమా ప్లాప్ తో రవితేజ రాజకీయాల మీద దృష్టి పెట్టాడు. మధ్యలో ఆయన హీరోగా సాయి పల్లవిని హీరోయిన్ గా పెట్టి సినిమా తీసేందుకు అనుచరులు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇద్దరు కలిసినట్లు సమాచారం. అది కాస్త వైరల్ అయింది. మంత్రి నారాయణ అల్లుడే రవితేజ. మామ మంత్రి, తండ్రి మంత్రి. అంతే రవితేజ బలాదూర్ గా హీరోయిన్ల వెంట తిరుగుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పేరు పెట్టక పోయినా మంత్రి గంటా స్పందించక పోవడంతో ఇంకా ప్రచారం మరింతగా సాగుతోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*