చినబాబు చెలరేగాడు

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం తీరును ప్రజలంతా తప్పుపడుతున్నారు. సిఎం చంద్రబాబు ఇప్పటికే తమ మంత్రులతో రాజీనామా చేయించారు. ఇక ఏపీ మంత్రి నారా లోకేశ్ ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన కేంద్రం తీరును తప్పుపట్టారు. నాలుగేళ్ల నుంచి బూటకపు హామీలను నమ్ముతూ వచ్చాం. ఇక వేచి చూసే కాలం చాలు అని ప్రస్తావించారు. కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ మంత్రులు వైదొలుగుతున్నారని చెప్పారు. తాము ఏం చేసినా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే. ఎంతవరకైనా వెళ్తామని మంత్రి లోకేశ్ కౌంటర్ ఇచ్చిన తీరు చర్చనీయాంశమైంది. పెదబాబునే కాదు.. చినబాబు చెలరేగిపోతున్నాడని టీడీపీ వర్గాల్లో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలా లోకేష్ ట్వీట్ చేశాడో లేదో వాటిని విపరీతంగా షేర్ చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. 
ఢిల్లీలో పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యేందుకు వెళ్లిన ఐటీ మంత్రి నారా లోకేష్ తన పని పూర్తి చేస్తున్నాడు. ఏపీకి పెట్టుబడులు తెప్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో టీడీపీ నేతలతోను ఢిల్లీలో ప్రత్యేకంగా మాట్లాడారు లోకేష్. కేంద్ర మంత్రి వర్గం నుంచి వైదొలుగుతున్నట్లు చంద్రబాబు ప్రకటించడమే ఆలస్యం హర్షం వ్యక్తం చేశారు టీడీపీ ఎంపీలు. మరోవైపు నారా లోకేష్ కు అభినందనలు తెలిపారు. ఇప్పటికైనా మంచి పని చేసారు. ప్రజల దృష్టిలో మనం దోషి కాకుండా ఉంటే చాలు. వాస్తవాలు వారికి అర్థమయ్యేలా చేద్దామంటున్నారు. తాము ఎందుకు రాజీనామాలు చేయాల్సి వచ్చిందనే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లనున్నారు టీడీపీ నేతలు. ఈ మేరకు ఆంధ్రాలో చంద్రబాబు, హస్తినలో లోకేష్ లు టీడీపీ నేతలతో మంతనాలు జరపడం హాట్ టాపికైంది. 

1 Comment

  1. adhikaaram lo vunna oka mantri twitter lo post lu pettadam dwara tana prabhavam chaatukovadam nijamgaa chodyame

Leave a Reply

Your email address will not be published.


*