శ్రీదేవి కూతుళ్ల‌కు.. అండ‌గా అన్న‌య్య‌!

వెండితెర అందాల రాణి శ్రీదేవి మ‌ర‌ణం.. అభిమానుల‌ను ఎంత‌గా వేధించిందో తెలియ‌దు కానీ.. యుక్త‌వ‌య‌సులో ఆడ‌పిల్ల‌లిద్ద‌రినీ అనాథ‌ల‌ను చేసింది. వ‌య‌సు వ‌చ్చిన ఆడ‌పిల్ల‌కు.. అమ్మ ఎంత అవ‌స‌ర‌మో క‌న్న‌పేగుకు మాత్ర‌మే తెలుస్తుంది. శ్రీదేవిని మొద‌ట నుంచి శ‌త్రువుగా భావిస్తూ.. ఆమెపై ద్వేషం పెంచుకున్న వ్య‌క్తి.. బోనీక‌పూర్ మొద‌టి భార్య త‌న‌యుడు అర్జున్‌క‌పూర్‌. కానీ.. ఇప్పుడు ధ్వేషం స్థానంలో బాధ్య‌త పెంచుకున్నాడు. జాన్వి, ఖుషీల‌కు నేనున్నానంటూ అన్న‌గా అండ‌గా ఉంటున్నాడు. పైగా చెల్లెళ్ల ఆల‌నా పాల‌నా కూడా తానే ప‌ర్య‌వేక్షిస్తున్నాడ‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కూ అర్జున్ క‌పూర్ శ్రీదేవిపై క‌క్ష‌తో ఆమె కూతుళ్ల‌ను తండ్ర‌కి దూరం చేస్తాడ‌నే ప్ర‌చారం జ‌రిగింది. కానీ.. త‌న‌కూ మ‌న‌సుంద‌ని.. తాను అన్న‌య్య‌గా చెల్లెళ్ల‌ను సాక‌గ‌ల‌నంటూ నిరూపిస్తూ.. శ్రీదేవి ఆత్మ‌కు శాంతి క‌లిగించేలా ఉండ‌టం.. నిజంగా చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో మంచి మార్పున‌కు నాందీ. శ్రీదేవి జీవితం.. పెళ్ల‌యిన వ్య‌క్తిని పెళ్లి చేసుకుంటే.. ఎటువంటి వేద‌న అనుభ‌విస్తుంద‌ని చాటితే.. ఎంత క‌క్ష‌లున్నా.. ఆప‌ద వ‌చ్చిన వేళ ర‌క్త‌సంబంధ‌మే నెగ్గుతుందంటూ అర్జున్ నిరూపిస్తున్నాడు. ఒక నాణేనికి రెండు కోణాలంటే ఇదేనేమో..!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*