ఇక కేసీఆర్‌.. బ‌రిలోకి దిగిన‌ట్లే!

మొన్న విమ‌ర్శ‌.. నిన్న ప్ర‌క‌ట‌న‌.. ఇప్పుడు రంగంలోకి.. కేసీఆర్ అంటే మ‌జాకానా అన్న‌ట్లుగా పావులు క‌దుపుతున్నారు. ఔను.. మూడోఫ్రంట్ ప్ర‌క‌ట‌న కేవ‌లం రెచ్చ‌గొట్టేందుకు కాద‌ని నిరూపించేందుకు గులాబీ బాస్ ర‌ంగంలోకి దిగారు. విప‌క్ష‌నేత‌లు.. ఉస్మానియా యూనివ‌ర్సిటీలోకి అడుగుపెట్ట‌ని కేసీఆర్ దేశం చుట్టొస్తాడంటూ చేసిన విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం ఇవ్వ‌బోతున్న‌ట్లు సంకేతాలిచ్చారు. ఈ మేర‌కు ముంబై, కోల్‌క‌తా, చెన్నై త‌దిత‌ర ప్ర‌ధాన న‌గ‌రాల్లో స‌మావేశాలు నిర్వ‌హ‌ణ‌కు ఏప్రిల్ నుంచి తేదీలు ఖ‌రారు చేశారు. రిటైర్డ్ అధికారులు, కాంగ్రెస్‌, బీజేపీకు వ్య‌తిరేక వ‌ర్గాలు.. పార్టీల‌ను క‌లుపుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే మ‌మ‌తాబెన‌ర్జీ, అమిత్‌జోగి వంటి సీనియ‌ర్ నేత‌లు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారంటూ ఫ్రంట్‌పై కేసీఆర్ స్ప‌ష్టంచేశారు. మ‌రోవైపు రాష్ట్ర బాధ్య‌త‌ల‌ను కేటీఆర్‌కు అప్ప‌గించేందుకు ముహూర్తం ఖ‌రారైన‌ట్లే చెబుతున్నాయి. అయితే.. ఇప్ప‌టికే సెకండ్ కేడ‌ర్ నాయ‌క‌త్వం కోసం ఎదురుచూస్తున్న సీనియ‌ర్లు ఎంత వ‌ర‌కూ కేటీఆర్‌కు స‌హ‌క‌రిస్తార‌నేది అయోమ‌యానికి తావిస్తోంది. కేటీఆర్ మొద‌టి ఏడాది గ్రూపుల‌కు దూరంగా వున్నా.. గ‌త కొద్దికాలంగా త‌న‌కంటూ ఓ వ‌ర్గాన్ని ఏర్ప‌ర‌చుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై హ‌రీష్‌తోపాటు నాయిని, మిగిలిన మంత్రులు కూడా కాస్త గుర్రుగానే ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఫ్రంట్‌మీద టార్గెట్ ఉంచితే.. స్వంత‌రాష్ట్రంలో అభాసుపాలు అయ్యే ప్ర‌మాదం ఉంద‌నేది గులాబీ పార్టీ నుంచి వ్య‌క్త‌మ‌వుతున్న మ‌రో ఆందోళ‌న‌. ఏదిఏమైనా.. కేసీఆర్ మాట అన్న‌డంటే అంతేనంటూ.. ఆయ‌న అనుచ‌రగ‌ణం.. స‌మ‌రోత్సాహానికి సిద్ధ‌మైంది. కేసీఆర్ మూడోఫ్రంట్ ప్ర‌క‌ట‌న వెనుక కార‌ణాలు ఏమైనా.. జాతీయ రాజ‌కీయాల్లో ఇదొక చర్చ‌గా మారింది. యూపీఏ, ఎన్‌డీఏ కూట‌మిల‌కు ధీటుగా మ‌రో నాయ‌క‌త్వం రావ‌టాన్ని ప్రాంతీయ‌పార్టీలు స్వాగ‌తించ‌టం కేసీఆర్‌కు క‌లిసొచ్చే అంశం. అదే స‌మ‌యంలో  ఏపీ నుంచి చంద్ర‌బాబు ఎంత వ‌ర‌కూ కేసీఆర్ వైపు మొగ్గుచూపుతార‌నేది ప్ర‌శ్నార్ధ‌క‌మే. ఎందుకంటే.. చంద్ర‌బాబు, కేసీఆర్ మ‌ధ్య చెలిమి అంత బాగాలేద‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. అదీ కాకుండా ఇద్ద‌రికీ రాజ‌కీయ వైరం ఉంది. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ప్ర‌ధాని అభ్య‌ర్థిగా.. ఒక‌వేళ అదృష్టం వ‌రిస్తే.. ప్ర‌ధాని ప‌ద‌వి చేప‌ట్టినా.. ఏపీకు ఎంత వ‌ర‌కూ స‌హాయ‌కారిగా ఉంటార‌నేది కూడా అనుమాన‌మే. కేసీఆర్ మ‌న‌సులో ఏమున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న ఏపీ నాయ‌కులుపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే వ‌చ్చారు. ఇప్ప‌టికిప్పుడు తాను మారానంటే.. న‌మ్మేవాళ్లు ఎవ‌ర‌నేది సందేహం.

1 Comment

  1. లేడికి లేచిందే పరుగన్నట్లు ఒక చోటా నాయకుడు రధం ఎక్కగానే యుద్ధం గెలిచేసినట్లు గా వ్రాయడం ….
    పాజిటివ్ థింకింగ్ అంటారనుకోను . పగటి కలలు’ లేదా విశృంఖల ఊహాగానం అని అనుకోవచ్చు. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఆశలు,హక్కులు ఉంటాయి. వాటిని సాధించుకోవడానికి ప్రయత్నించుకోవచ్చు. కానీ వచ్చిన చిక్కేమిటంటే దానికీ ఒక అర్హత అవీ ఇవీ ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published.


*