ఏకతాటి పైకి రానున్న కేసీఆర్, చంద్రబాబు, పవన్ లు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చిన తీరు హాట్ టాపికైంది. దేశంలో మూడో ఫ్రంట్ ఏర్పాటు చేస్తానన్న కెసిఆర్ ను అభినందించారు పవన్. రాబోయే కాలంలో తెలంగాణలో కేసీఆర్ తో పొత్తు పెట్టుకునేందుకు పావులు కదుపుతున్నారు పవన్. అందుకే కేసీఆర్ కు మద్దతు ప్రకటించారని తెలుస్తోంది. ఏపీకి హోదా ఇస్తామని… ప్యాకేజి అని, కాదు కాదు నిధులు అని ఇలా ప్రజలను నిలువునా మోసం చేస్తోంది బీజేపీ సర్కారు. అందుకే పక్క రాష్ట్ర సి.ఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఏపీకి అన్ని రకాలుగా ఇవ్వాల్సింది ఇచ్చి తీరాల్సిందేనని చెప్పారు. అందుకే పవన్ కల్యాణ్ ఆయన్ను అభినందించారు. 
ప్రత్యేక హోదాకు కెసిఆర్ కూడా అనుకూలంగా మాట్లాడటాన్ని ప్రతి ఒక్కరు మెచ్చుకుని తీరాల్సిందే. తన రాష్ట్రం సంగతి ఆయన చూసుకోకుండా పక్క రాష్ట్రం బాగుండాలనే ఆలోచన చేయడం మంచిదే. అందుకే సాటి తెలుగువాడిగా కెసిఆర్ మాట్లాడారని ఇది అభినందనీయమని పవన్ అంటున్నారు. తెలంగాణలో పర్యటించిన సమయంలోను కేసిఆర్ పై అభినందనల జల్లు కురిపించారు పవన్. ఇప్పుడు అదే పని చేసారు. మరోవైపు ఏపీలోను చంద్రబాబుతో కలిసి సాగేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నారు పవన్. ఇప్పటికే ఒప్పందం పూర్తి అయినట్లు తెలుస్తోంది. 
కేసిఆర్ మూడో ఫ్రంట్ అవసరమని అంటున్నారు.  చంద్రబాబు నాయుడు, పవన్, కెసిఆర్ లు కలిసి మూడో ఫ్రంట్ పెడుతుండగా… మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, శివసేన, లాలూ లాంటి వారు కలిసి సాగే వీలుంది. ఏపీకి న్యాయం చేసేందుకు దేశ వ్యాప్తంగా నేతలు మాట్లాడుతున్న తీరు ఆసక్తికరమే. పార్లమెంటు సమావేశాల్లో తాడో పేడో తేల్చుకునేందుకు ప్రధాన పార్టీలు సిద్దమవుతున్నాయి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*