కువెట్‌లోనూ ఏపీ ‘ప్రత్యేక’ గళం

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆంధ్రులు ప్రత్యేక హోదాపై తమ నిరసన గళం విప్పుతున్నారు. ఒక వైపు అమెరికా బే ఏరియాలో మౌన ప్రదర్శనతో తమ ఆవేదనను వ్యక్తం చేయడానికి సిద్ధపడగా.. మరోవైపు అరబ్బు దేశాల్లోనూ ఏపీకి న్యాయం చేయాలనే డిమాండ్లు పెరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఏపీకి న్యాయం చేయాలని, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ కువెట్‌లో తెలుగుదేశం పార్టీ, తెలుగు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ‘ఏపీ డిమాండ్స్‌ జస్టిస్‌’ అనే నినాదంతో కువెట్‌లోని ఒమేరియ పార్కులో భారీగా చేరుకుని ఏపీకి మద్దతుగా కేంద్రం నిలబడాలని డిమాండ్‌ చేశారు. ఆ దేశ తెలుగు సంఘాల ఐక్య వేదిక కన్వీనర్‌, టీడీపీ కువైట్‌ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకరరావు నాయకత్వాన ఆంధ్రులు ముందుకు కదిలారు. కేంద్రప్రభుత్వ వైఖరిని ఖండించడంతోపాటు వచ్చే ఎన్నికల్లోనూ మోదీ, చంద్రబాబు కాంబినేషన్‌ను ప్రజలు కోరుకుంటున్నారని ఆసక్తికర కామెంట్లు చేశారు. అందుకే అన్ని హామీలు నెరవేరిస్తే ఏపీ ప్రజలు అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*