ఏపీకి న్యాయం చేయాలని అమెరికాలో మౌన నిరసన

ఆంధ్రప్రదేశ్ విభజనతో ప్రజలు చాలా నష్టపోయారు. ఇంకా నష్టపోతూనే ఉన్నారు. మెజార్టీ ప్రజల నిర్ణయాన్ని కాదని ఏకపక్షంగా విభజించడమే ఇందుకు కారణం. అందుకే నవ్యాంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలని అమెరికాలోని ఎన్నారైలు నిరసన వ్యక్తంచేయనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజి, పోలవరం నిధులు, విభజన హామీల అమలు, విశాఖ, విజయవాడ మెట్రో నిధుల కేటాయింపులు వంటి ఎన్నో విషయాల పై ఏపీ ప్రజలకే కాదు..ఎన్నారైలు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఏపీ ఎన్నారైలు ఈ విషయం పై మార్చి3న మౌన నిరసన చేపట్టనున్నారు. అమెరికాలోని కాలిపోర్నియా రాష్ట్రంలోని బే ఏరియాలో ఈ సెలెంట్ ప్రొటెస్ట్ జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరిగే ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు ఏపీ ఎన్నారైలు. బే ఏరియాలోనే 691 ఎస్ మిల్ పిటాస్ బిఎల్ విడి లో జరిగే కార్యక్రమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. కేంద్రం వెంటనే ఏపీని ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఏపీని ఆదుకుంటామని చెబుతూనే…కాంగ్రెస్, బీజేపీలు నిధుల విషయంలో ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసిందే. అందుకే ఏపీకి న్యాయం చేయాలని వారు అమెరికాలో నిరసన చేయడం మాములు విషయం కాదు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*