ఐవైఆర్ కు కోర్టులో ఎదురుదెబ్బ

ప్రభుత్వాలు మారతాయి. పాలకులు మారతారు. కానీ అధికారిక రహస్యాలు అంతే ఉండాలి. లేకపోతే ప్రజలకు ఇబ్బంది వస్తోంది. ఆమాత్రం ఇంకితజ్ఞానం పని చేసే వారికి ఉంటోంది. దేశరక్షణ వ్యవస్థకు సంబంధించిన కీలక రహస్యాలు అన్నీ అలానే ఉంటాయి. అంతే కాదు..పాలన వ్యవహారాలు రహస్యంగానే ఉంచాలి. కానీ అలా చేయడం లేదు. ప్రధాన కార్యదర్శిగా పని చేసి రిటైర్ అయిన ఐవైఆర్ కృష్ణ రావు. బ్రాహ్మణ కార్పోరేషన్ నుంచి ఆయన్ను తొలగించడంతో చంద్రబాబు పై విమర్శల దాడి మొదలు పెట్టారు ఐవైఆర్. అమరావతి రాజధాని నిర్మాణం, భూముల సేకరణ వంటి పనులను ‘స్విస్‌ చాలెంజ్‌ విధానంతో చేస్తోంది చంద్రబాబు సర్కార్. దానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు ఐవైఆర్. 
కానీ హైకోర్టుకు వెళ్లిన ఆయనకు అనుకోని షాక్ తగిలింది. ఊహించని ప్రశ్నలు ధర్మాసనం నుంచి ఎదురయ్యాయి. స్విస్ ఛాలెంజ్. విధానం నోటిఫికేషన్‌ జారీచేసినపుడు మీరే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పదవీ విరమణ చేసిన తర్వాత ప్రజాహిత ప్రయోజనం ఎలా వేస్తారు? ఇందుకు సంబంధించిన నోట్‌ఫైల్‌పై ఆనాడు మీ అభ్యంతరాలు నమోదు చేశారా లేదా అని అడిగింది కోర్టు. అంతే నీళ్లు నమలడం ఐవైఆర్‌ కృష్ణారావును వంతు అయింది. ఆ సంగతి తనకు అంతగా గుర్తులేదని.. అందుకు సంబంధించిన పత్రాలను సమాచార హక్కు చట్టం కింద తీసుకుని కోర్టుకు చెబుతానన్నారు. అంటే తెలిసి కూడ తెలియదని చెబుతున్నారా..అసలు ఏం తెలియక పోతే కోర్టుకు ఎందుకు వచ్చారని ప్రశ్నించింది ధర్మాసనం. అవాక్కవడం ఐవైఆర్ వంతు అయింది. 
మీ హయాంలోనే రూపొందించిన ఈ విధానంపై అప్పుడు ఏం చేశారు. అసలు తెలియదని మీరే చెబితే ఎలా? ప్రజాహిత వ్యాజ్యంలో ప్రజా ప్రయోజనాలు ఉండాలి. అంతే గానీ వ్యక్తిగత అంశాలకు తావు ఇవ్వరాదని కోర్టు చెప్పింది. పిల్‌ నిబంధనలు ఏం చెబుతున్నాయో చదువుకోండి’ అని హితవు పలికింది. స్విస్‌ చాలెంజ్‌ విధానం రూపొందించినప్పుడు మీరు సీఎస్ గా ఉన్న విషయాన్ని పిల్‌లో ఎందుకు ప్రస్తావించలేదని అడిగింది. అమరావతి అభివృద్ధి కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని ఐవైఆర్‌ కృష్ణారావు ప్రశ్నించారు. ఆ పద్దతి బాగోలేదని చెప్పారు. అందుకే పిల్ దాఖలు చేశారు. ఈ విషయంలో ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ అభ్యంతరం చెప్పారు. స్విస్‌ చాలెంజ్‌పై నోటిఫికేషన్‌ను 2015 మే నెలలో ఇచ్చారు. అప్పుడు ఐవైఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2016 జనవరి 30న ఆయన పదవీ విరమణ చేశారని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. స్విస్‌ చాలెంజ్‌పై ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయంలో ఐవైఆర్ భాగస్వామిగా ఉన్నారనే నిజాన్ని చెప్పారాయన. ఈ అంశాన్ని ఆయన తన పిటిషన్‌లో ఎక్కడా చెప్పలేదన్నారు. దీంతో.. ఇది మీరు సీఎస్ గా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయమని పిల్‌లో ఎందుకు పేర్కొనలేదని ధర్మాసనం అడిగింది. దీంతో సవరణలతో అదనపు అఫిడవిట్‌ వేస్తానని, గడువు ఇవ్వాలని కృష్ణారావు కోరారు. అందుకు సమ్మతించిన హైకోర్టు తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. 
బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఉద్యోగ సంఘాల పదవుల నుంచి ఐవైఆర్ ను ప్రభుత్వం తొలగించింది. తనను తొలగిస్తారా అంటూ ఆయన ప్రభుత్వం పై వ్యతిరేక పెంచుకుని ఇలా రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారనే చర్చ సాగుతోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*