కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం అయ్యారు. 1954 నుంచి ఆయన పీఠాధిపతిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇంత సుదీర్ఘకాలం పీఠాదిపతిగా మరెవరు లేరు. హైందవ సమాజానికి ఆయన చేసిన సేవలను ప్రధాని మోడీతో పాటు.. హిందూ ధార్మిక సంస్థలు కొనియాడాయి. కంచిమఠం అభివృద్ధికి 69వ పీఠాధిపతిగా జయేంద్ర సరస్వతి బాధ్యతలు తీసుకున్నారు. విదేశీ భక్తులను ఆకర్షించడంలో ఆయనదే పై చేయి. విద్య, వైద్య రంగాల్లో ఎంతో మందికి కంచి మఠం సాయం చేసింది. స్కూళ్లు, ఆసుపత్రులు ఏర్పాటు చేశారు శంకర నేత్రాలయ, పిల్లల ఆసుపత్రి, హిందూ మిషన్ ఆసుపత్రి, తమిళనాడు ఆసుపత్రులను జయేంద్రనే సారధ్యంలో వచ్చినవే. పూజ్య గురువు చంద్రశేఖర సరస్వతితో కలిసి మూడు సార్లు దేశం మొత్తం పాదయాత్ర చేసిన ఘనత ఆయనదే.
భారత్ లోనే కాదు…బంగ్లాదేశ్లో ఆధ్మాత్మిక కార్యక్రమాలను నిర్వహించిన తొలి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి. దక్షిణేశ్వరంలో పర్యటించి శంకర గేట్ ను నిర్మించారు. మానస సరోవర యాత్ర చేసి శంకర శిలలను స్థాపించారు. ఆయన సొంతూరు తమిళనాడు. అసలు పేరు సుబ్రహ్మణ్య మహదేవ అయ్యర్. కంచి పీఠాదిపతి అయిన తర్వాత జయేంద్ర సరస్వతిగా పేరు మార్చుకున్నారు. ఆయన మహా నిర్యాణం చెందడంపై పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు.
తెలంగాణ సిఎం కేసీఆర్ ఏపీ విభజనకు కారకుడు. ఆయన ఆరోగ్యం దెబ్బతింటుందనే ప్రచారం చేస్తోంది కాంగ్రెస్. రేవంత్ రెడ్డి లాంటి వారు ఆ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. వీలున్నంత తొందరగా తన కొడుకును సిఎం కుర్చీలో కూర్చోపెట్టే పనిచేయనున్నారు కేసీఆర్. ఇక విభజన బిల్లు ఆమోదించాలని […]
మోదీ మంత్రంతో కేంద్రంలో బీజేపీ అధికారం ఏర్పాటు చేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ పార్టీ మంచి పట్టు సాధించింది. కేవలం మోదీ మీద అభిమానంతో ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపించారు. అయితే దేశ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాలు మాత్రం ఎప్పుడు విభిన్నతను ప్రదర్శిస్తుంటాయి. […]
Be the first to comment