జగన్ @100 రోజులు

వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, విపక్ష నేత జగన్మోహనరెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర వందో రోజుకు చేరింది. ప్రకాశం జిల్లాలో జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. ఉప్పలపాడు శివారు నుంచి 100వ రోజు పాదయాత్రను వైఎస్‌ జగన్‌ పాదయాత్రను ప్రారంభించారు. కడప జిల్లా ఇడుపుల పాయలో ప్రారంభమైన యాత్ర… కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల మీదుగా ప్రకాశం జిల్లాకు చేరింది. మరికొద్ది రోజుల్లో గుంటూరుకు చేరుకోనుంది. ఈ యాత్రలో భాగంగా ప్రజలను కలవడం, వారి సమస్యలను వినడం వంటివి చేస్తున్నారు జగన్. అదే సమయంలో తాము అధికారంలోకి వస్తే సమస్యలను పరిష్కరిస్తానని హామీలు ఇస్తున్నారు. మొత్తం వంద రోజుల్లో జగన్ 1340 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. పోయినేడు నవంబర్ 6న జగన్ కడప జిల్లా ఇడుపుల పాయలో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి నివాళి అర్పించి పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే.
అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సి రావడంతో వారంలో ఒక రోజు యాత్రకు విరామం ప్రకటిస్తున్నారు జగన్. క్రిస్మస్ రోజు సెలవు తీసుకున్న జగన్ సంక్రాంతికి యాత్రను కొనసాగించారు. కానీ ఏపీకి ప్రత్యేక హోదా కోసం బంద్ చేస్తే తాను ఆ రోజు వారికి సహకరించారు. రేపు జిల్లాల్లో జరిగే ఆందోళనలు, ధర్నాల కోసం మరోసారి యాత్రకు విరామం ప్రకటించడం చర్చనీయాంశమైంది. తొలిగా చంద్రబాబు, లోకేష్ ఆయన కుటుంబీకుల పై తీవ్ర స్థాయి విమర్శలు చేసిన జగన్… ఆతర్వాత తాను ఏం చేస్తానో చెబుతూ వస్తున్నాడు. ఫలితంగా జగన్ లో మార్పు వచ్చిందా లేక ఇప్పుడే ఎందుకు అని ఆగాడా అనేది అర్థం కాలేదు జనాలకు. ఏపీ అభివృద్ధి చెందుతుందని..పెట్టుబడులు వస్తున్నాయనేది ప్రజల భావన. ఇలాంటి సమయంలో పని చేసే ప్రభుత్వాన్ని కాదని..మరొకరికి అవకాశం ఇస్తారా అనే వాదన లేకపోలేదు. అభివృద్ధి సంగతి అటుంచి..నాలుగేళ్లు అయినా ఇంత వరకు ఒక్క ఇటుక ముక్క వేయకుండా అమరావతి రాజధాని నిర్మాణం చేయకుండా చంద్రబాబు నాన్చుడు ధోరణినే కొనసాగించారనే విమర్శలు ఉన్నాయి. ఇవన్నీ జగన్ కు వరంగా మారతాయనే చర్చా లేకపోలేదు. 
యాత్రకు కొన్ని చోట్ల బాగా స్పందన వచ్చినా..మరికొన్ని చోట్ల అసలేం లేరనే విషయాన్ని జగన్ వైరి వర్గం మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. బాగా జగన్ కు జనం వచ్చిన చోట పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఫలితంగా మీడియా రెండు వర్గాలుగా విడిపోయిందని అర్థమవుతోంది.  
 
  

1 Comment

  1. 100రోజులు కాదు, 100 నెలలు పాదయాత్ర చేసినా, ఆశించిన ఫలితం రాదు. మేక తోలు కప్పుకున్నంత మాత్రాన పులిని కౌగలించుకోలేము.

Leave a Reply

Your email address will not be published.


*