దేవకన్య శ్రీదేవికి తారా లోకం కడసారి వీడ్కోలు

పూల రెక్కలు, కన్నీటి చుక్కలతోతరలి వచ్చిన తారా లోకం కడసారి వీడ్కోలు:
దేవకన్య శ్రీదేవిని కడసారి చూసేందుకు తారా లోకం కదిలి వచ్చింది. అభిమానుల సందర్శన కోసం శ్రీదేవి మృతదేహాన్ని అందుబాటులో ఉంచారు. నాలుగు కిలోమీటర్ల దూరం క్యూ ఉందంటే ఎంతగా అభిమానులు తరలి వచ్చారో అర్థమవుతోంది. ముంబయిలోని సెలబ్రేషన్స్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌కు ఆ తర్వాత మిగతా ప్రాంతాలకు వారు వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించారు. వారెవరు శ్రీదేవికి తెలియదు. కానీ తమ ఇంట్లో బంధువు చనిపోయినట్లుగా రోధించారు. పెద్ద సంఖ్యలో సినీ ప్రముఖులు, అభిమానులు తరలివచ్చారు.
అమితాబ్ బచ్చన్, చిరంజీవి, నాగార్జున, రానా, దగ్గుబాటి సురేష్, ఎన్టీఆర్, కమల్ హాసన్, రజనీకాంత్, ఐశ్వర్యారాయ్‌, అనిల్‌ కపూర్‌, సంజీవ్‌ కపూర్‌, సోనమ్‌ కపూర్‌, ఊర్వశి రౌతెలా, ఆదిత్య ఠాక్రే, సల్మాన్‌ ఖాన్‌, అర్బాజ్‌ ఖాన్‌, ఫరా ఖాన్‌, అను కపూర్‌, హేమమాలిని, ఇషా డియోల్‌, హర్షవర్ధన్‌ కపూర్‌, సారా అలీ ఖాన్‌, అర్జున్‌ కపూర్‌, అక్షయ్‌ ఖన్నా, రితేశ్‌ దేశ్‌ముఖ్‌, సుస్మితాసేన్‌, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అంబానీ కుటుంబ సభ్యులు శ్రీదేవికి నివాళులు అర్పించారు. 
శ్రీదేవి భౌతికకాయాన్ని సందర్శించేందుకు మీడియా ప్రతినిధులను రావాలని కోరింది కపూర్ కుటుంబం. కానీ లోపలికి వచ్చేటప్పుడు కెమెరాలు, వాయిస్‌ రికార్డర్లులాంటి తీసుకురావద్దని కోరింది. ఎవ్వరూ శ్రీదేవి భౌతికకాయం ఫొటోలను తీయవద్దని కోరడం ఆసక్తికరమే. 
శ్రీదేవిని గౌరవిస్తా…
బోనీకపూర్ మొదటి భార్య మోనా కుమారుడు అర్జున్ కపూర్. అర్జున్ కు శ్రీదేవికి గొడవలుండేవనే ప్రచారం ఉంది. కానీ అది నిజం కాదని.. తన ఎదుగుదలకు ఆమె ఎంతో పాటుపడిందని అర్జున్ కపూర్ చెప్పారు. అంతేకాదు… ‘శ్రీదేవి అంటే నాకెంతో గౌరవం. మా నాన్న జీవితంలోకి ఎవరొచ్చినా గౌరవిస్తానని, అలాగే శ్రీదేవిని కూడా’ అని చెప్పాడు. అర్జున్ కపూర్. శ్రీదేవిని కడసారి చూసేందుకు దుబాయ్ కు వెళ్లి మరీ తండ్రికి సాయపడ్డారు. దీంతో అర్జున్ కపూర్ కు ఉన్న కోపం పోయిందంటున్నారు. మనిషే పోయిన తర్వాత ఈ పగలు, ద్వేషాలు, స్వార్థాలు ఎందుకు అనుకున్నారేమో… ఆమె పై గౌరవం చూపారు అర్జున్ కపూర్. వివాదాలకు పుల్ స్టాప్ పెట్టారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*