చిదంబరంకు తెలిసొచ్చింది…

ఆంధ్రప్రదేశ్ ను రెండు ముక్కలు చేయడంలో కీలక పాత్ర పోషించిన వారిలో ఒకరు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం. ఏపీ అభివృద్ధి జరిగితే అక్కడి నేతలు తమ మాట వినరని బలంగా నమ్మారాయన. తమిళనాడును విడగొట్టేందుకు ఆయన ఒప్పుకోలేదు. కానీ ఏపీని విడగొట్టేందుకు సోనియమ్మతో కలిసి పావులు కదిపారు. చివరకు అనుకున్న పని చేశారు. కనీసం ఏపీకి అనుకూలంగా ఒక్క నిర్ణయం తీసుకోకుండానే పదవి కాలం పూర్తి చేశారాయన. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు చిదంబరంకు ఏపీ ప్రజల ఉసురు తగులుతుందంటున్నారు. 
ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరాన్ని సిబిఐ అరెస్టు చేసింది. ఇదో సంచలనంగా మారింది. జగన్ వద్ద వేల కోట్ల రూపాయలు చూశారు. కానీ చిదంబరం వద్ద లక్షల కోట్ల రూపాయల అక్రమాస్తులు ఉన్నాయనే ప్రచారముంది. అందుకే సిబిఐ ఆయన కుటుంబంపై దృష్టి సారించింది. వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. ఫలితంగా కార్తీ సిబిఐ బోనులో చిక్కాడు. ఆయనపై కేసు నమోదు అయినా.. ఆధారాలు దొరికినా ఇంతవరకు అరెస్టు చేయకపోవడంతో కార్తీ తప్పించుకున్నాడనే ప్రచారం వచ్చింది. ఆ అనుమానాలకు తెరదించుతూ రంగంలోకి వచ్చింది సిబిఐ. ఫెమా(ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌) నిబంధనల ఉల్లంఘన, కేసుకు సహకరించడం లేదని ఆరోపణలతో చెన్నైలో కార్తీ చిదంబరాన్ని అదుపులోకి తీసుకుంది. అతనే కాదు… ఐఎన్‌ఎక్స్‌ మీడియా డైరెక్టర్లు – పీటర్, ఇంద్రాణి ముఖర్జీలతో సహా నిందితులపై ఎన్ఐఆర్ఐఆర్ నమోదు చేశారు. సన్ స్ట్రోక్ ( కుమారుడి కేసు) తగలడంతో చిదంబరం విలవిల్లాడుతున్నారు. ఎలాగైనా కొడుకును కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తనకు పరిచయం ఉన్న కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి కేసుల తీవ్రతను తగ్గించేలా పావులు కదుపుతున్నాడనే ప్రచారం సాగుతోంది. 
కానీ పైకి మాత్రం… తమను రాజకీయం వేధించేందుకు ఇలాంటి కేసులు పెడుతున్నారని ఆరోపించారాయన. తాము సిబిఐని ఉసిగొల్పినప్పుడు నిజమైన కేసులు. తన దాక వస్తే రాజకీయ కేసులు. ఇదండీ వరుస. తప్పు చేసిన వాడు ఒప్పుకుంటాడా. చిదంబరం కొడుకు అంతేనంటున్నారు. ఎవరు ఎన్ని ఒత్తిడులు తెచ్చినా కార్తీ చిదంబరం కేసులో వెనక్కు తగ్గేది లేదంటోంది మరోవైపు సిబిఐ. 

1 Comment

  1. తెలంగాణ కావాలని తెలంగాణ ప్రాంత ప్రజలు అడగడంలో తప్పులేదు. రాష్ట్రవిభజన రెండు పక్షాలకు న్యాయ సమ్మతం గా చేయక పోవడానికి మూలకారణం చిదంబరం,జైరాం రమేష్,సోనియా గాంధీ . ఇపుడు ఈ లిస్ట్ లో మోడీ కూడా చేరారు.
    ఈ నలుగురిని,అలాగే శల్య సారధ్యం తో ఆంధ్రాని వంచించిన అప్పటి ఆంధ్రా కాంగ్రెస్ MP లు ,ఇప్పటి ఆంధ్రా BJP MP లను … ఆంధ్రా ఇప్పట్లో క్షమించదు.

Leave a Reply

Your email address will not be published.


*