అధికారులపై నిందలేస్తున్న వైసీపీకి కలిసొస్తుందా..!

ఆంధ్రప్రదేశ్ లోని కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేసి రాజకీయ ప్రయోజనం పొందేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీని పై ఇప్పుడు దుమారం రేగుతోంది. వైకాపా నేతలు పార్టీ ఫిరాయింపు చేయడం వెనుక ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారి సతీష్ చంద్ర, మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు రాజమౌళి, సాయిప్రసాద్‌ తో పాటు ఐపీఎస్ అధికారి ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుల పాత్ర ఉందని విజయసాయి చేసిన నేరుగా ఆరోపణ చేస్తోన్నారు. పార్టీ ఫిరాయింపుల్లో వీరి ప్రమేయం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉందని, దానికి సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయని సాయిరెడ్డి అందిరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అంతే కాదు… ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా అడ్డుకుంటున్నారని, ఇందుకు తగిన ఆధారాలున్నాయని.. వాళ్లు అడిగితే బయటపెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
            ఫలితంగా ఇది తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఏది నిజం అనేది ఉత్కంఠను పెంచుతోంది.  వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి తాను ఐఎఎస్ అదికారులు కొందరిపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, వారు రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తున్నారనేది వారి అభ్యంతరం. అలా వ్యవహరించే నలుగురు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులపై తక్షణ చర్య తీసుకోవాలని వైసీపీ ప్రధాన డిమాండ్ గా తెరపైకి తెస్తుంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ నేతలతో కలిసి ప్రలోభాలకు గురి చేస్తూ.. పెద్ద మొత్తంలో లంచాలు ఇవ్వజూపారని ఆయన అంటున్నారు. తాము చేసిన ఆరోపణలు బయటపెట్టాలని ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు కోరుకుంటే కచ్చితంగా ఆధారాలు చూపిస్తామని విజయసాయి రెడ్డి చెప్పడం మరింత హాట్ టాపికైంది. మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలతో తమ ఆరోపణలు నిజమని తేలాయని విజయసాయిరెడ్డి చెప్పారు. ఇదే ప్రచారం బలంగా చేస్తే ప్రజల్లో కొంత సానుకూల ప్రభావం చూపే అవకాశముందని ఆ పార్టీ అంచనా వేస్తుంది. వైసీపీ అంచనా వేసే ఫలితం వస్తుందో లేదో వేచి చూడాల్సిందే మరి.
నేను అమ్ముడుపోయాను…
నేను డబ్బులకు అమ్ముడు పోయానని కర్నూలుజిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ బహిరంగంగానే చెప్పాడు. తాను చేయకూడని పని చేశాను. తప్పు తెలుసుకున్నాను. అందుకే నిజం చెబుతున్నట్లు ప్రకటించారు. ఆ ఆరోపణలకు అది బలం చేకూర్చుతుంది. మరోవైపు తెలుగుదేశం ఎంపీ రాయసాటి సాంబశివరావు వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డిపై డిజిపికి పిర్యాదు చేశారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేయాలని కోరారు. అధికారుల పై విజయసాయి అనుచిత వ్యాఖ్యలు చేశారని, అవి సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని రాయపాటి ప్రత్యారోపణతో రెండు పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. జగన్ కూడా విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, అధికారులు, నేతల పరువుకు నష్టం కలిగించినందుకు ఐపీసీ సెక్షన్‌ 500 కింద కేసులు నమోదు చేయాలని కోరడంతో పోలీసులు ఏం చేస్తారనేది ఆసక్తికర అంశమైంది. 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*