బిజి బిజిగా మంత్రి కొల్లుగారి కువైట్ పర్యటన

మంత్రి కొల్లు రవీంద్రగారు రెండు రోజుల పర్యటన నిమిత్తం కువైట్ వచ్చి వివిధ కార్యక్రమాలలో బిజి బిజిగా గడిపారు. కువైట్ లో అక్రమముగా నివసిస్తున్న ప్రవాసుల కోసం పెట్టిన క్షమాబిక్ష ద్వారా మన తెలుగు వారిని అన్నివిధాల ఆదుకోవాలని చంద్రబాబుగారి ఆదేశాలమేరకు ఏపిఎన్నార్టి అధ్యక్షులు రవి వేమురు గారితో కలసి వచ్చారు. ముందుగా భారతరాయబారి జీవసాగర్ గారిని కలసి తెలుగు వారి సమస్యలను వివరించి పరిక్షారానికి అన్నివిధాల సహకరించాలని , తెలుగు వారిని అన్నివిధాల ఆదుకోవాలని అలాగే జన్మ దృవీకరణ పత్రాల విషయాలలో ఇబ్బందిపడుతున్న చిన్నపిల్లల విషయాలలో త్వరితగతిన సమస్యను పరిక్షరించాలని కోరారు. తరువాత రాయభారికార్యాలయం బయట తెలుగువారిని కలసి వారి సమస్యలను ఓపిగావిని అన్నివిధాలా ఆదుకుంటామని, ఏమ్నస్టీలో ఇంటికి తిరివివేళ్ళటానికి టిక్కెట్లను ఏపిఏన్నర్టీ ద్వార కల్పిస్తామని, అక్కడ అంధ్ర ప్రదేశ్ లొ తగిన శిక్షణ ఇచ్చి జీవన బ్రుతికోసం స్టైఫండ్ కూడా ఇస్తామని హామి ఇచ్చారు.

తరువాత అదేరోజు వాఫ్రా ప్రాంతములో తోటలలో పనిచేస్తున్న కూలీలను కలసి వారి సాదక భాదకాలను విని వారు చేస్తున్న పనులను చూసి వారికి అంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి అన్నివిధాలా సహాయ సహకారాలను అందిస్తామని భరోసా ఇచ్చారు.

తరువాత జజీర ఎయిర్ వేస్ వారి ప్రతినిదులతో సమావేశమై ఎమ్నస్టీ లొ తిరిగిరాదలసుకున్న తెలుగువరి కోసం ప్రత్యేక చార్జీలు, అలాగే కువైట్నుండి అంధ్రప్రదేశ్ లోని ప్రముఖ నగరాలకు విమాన సర్వీసుల కోసం చర్చించారు.

అనంతరము కువైట్ లోని తెలుగు ముస్లిం మైనార్టీ సంఘాలు ఏర్పాటుచెసిన సమావెశంలో పాల్గొని వారి నాయకులతో మట్లాడి వారు ఇచ్చిన వినతి పత్రాన్ని స్వీకరించి వారి సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళతానాని మాట ఇచ్చారు. తరువాత వై.ఎస్సర్.సి.పి పార్టి కువైట్ నాయకులు వచ్చి మంత్రిగారిని కలసి కువైట్ లోని తెలుగు వారి సమస్యలను తెలియచేసి ప్రభుత్వం అన్నివిధాల ఆదుకోవాలని వినతిపత్రాన్ని అందచేసారు.

రెండవ రోజు కార్యక్రమాలలో బాగంగా ముందుగా జజీర ఎయిర్ వేస్ సి.ఈ.వో గారి ఆహ్వానం మేరకు వారి కార్యాలయాన్ని సందర్సించి కువైట్ నుండి అంధ్ర ప్రదేశ్ కు జజీరా ఎయిర్ వేస్ విమాన సర్వీసులు నడపాలని దానికి అన్నివిదాల ప్రభుత్వం తరుపునుండి సహాయ సహకారలను అందిస్తామని కోరుతూ వారిని అమరావతి సందర్సించవలసినిగా అహ్వానించారు.

తరువాత కువైట్ లోని ప్రముఖ కంపనీ ప్రతినిదులలతో సమావేశమయి అంధ్ర ప్రదేశ్ రాష్ట్రము కడప మరియు గుంటూర్ లలో పెట్టబోయే స్కిల్ డవలప్మెంట్ సెంటర్లు అందులో ఇవ్వబోయే శిక్షణ తదితర విషయాలను చర్చించారు. గల్ఫ్ స్పిక్ ఫైనాన్స్ డైరక్టర్ నారాయన గారిని మరియు హెచ్ ఆర్ మేనేజర్ గారిని , అల్మీర్ టెక్నికల్ సర్వీసెస్ కంపనీ జనరల్ మేనేజర్ చంద్ర పటవర్దన్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ కంపనీ జనరల్ మేనేజర్ అమర్ అల్-అవాధి గారిని కువైట్ లో వుద్యోగ అవకాశాలు అందుకు కావలసిన క్వాలిఫికేషన్స్ తదితర విసయాలను అడిగి తెలుసుకున్నారు.

అక్కడ ఏపిఎన్నార్టి డైరెక్టొర్ రాజశెఖర్ గారు, ఎక్సెక్యుటివ్స్ సుధాకర రావు గారు, ఉదయ్ ప్రకాష్, సురేష్ బాబు నాయుడు, మోహన్ భాబు, మగులురి వాసు, ఈశ్వర్ నాయుడు, భొరా తదిరులు మంత్రిగారి పర్యటనకు అన్నివిధాల ఏర్పాట్లు చేసి కార్యక్రమాలు విజయవంతం అవటానికి క్రుషి చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*