తెలంగాణలో పొత్తు ఏపీ వద్దు

ఏపీలో బీజేపీ, టీడీపీలు కలిసి పోటీ చేసే అవకాశం కనిపించడం లేదు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ఇచ్చేందుకు సిద్దంగా లేదు. అదే విషయంపై ఆ పార్టీని ఇరుకున పెట్టేందుకు టీడీపీ, మిగతా పక్షాలు చూస్తున్నాయి. ఫలితంగా ఏపీలో లేకపోయినా తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనేది ఆ పార్టీ పెద్దల ఆలోచనగా ఉంది. తెలంగాణలో టీడీపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. కీలక నేతలు తలా ఓవైపుకు వెళుతున్నారు. మిగిలిన వారికి అవకాశాలు లేక కొందరు, మరో పార్టీలో తమకు అంతగా ప్రాధాన్యం ఉండదని మరికొందరు, ఇప్పుడు కాకపోయినా భవిష్యత్ లో టీడీపీ బాగుంటుందనే ఆలోచనతో ఇంకొందరు కొనసాగుతున్నారు. మొత్తంగా తెలంగాణ టీడీపీ ఒంటరిగా పోటీ చేసి పొందే లాభం కూడ ఏం లేదు. అందుకే తెలంగాణ వరకు టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు ఎదురు చూస్తోంది బీజేపీ. 
కానీ పొత్తు పెట్టుకుంటే రెండు చోట్ల ఉంటోంది. లేకపోతే ఎక్కడా వద్దనేది టీడీపీ నేతల ఆలోచనగా ఉందట. మరోవైపు తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం టీడీపీతో పొత్తు వద్దంటున్నారు. కానీ అమిత్ షా మాత్రం బలవంతంగానైనా వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఎవరికి వారే నేతలు అసలు సిసలు రాజకీయానికి సిద్దమవుతున్నారు. 
సోము మళ్లీ పేలాడుగా…
ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు మరోసారి విరుచుకుపడ్డాడు. టీడీపీ ముఖ్యంగా చంద్రబాబు పేరు చెబితేనే ఆయన స్వరం పెరుగుతోంది. హోదా విషయంలో చంద్రబాబు మాటి మాటికి మాట మార్చడాన్ని ఆయన తప్పు పట్టారు. హోదా అంటే జైలుకే అని స్వయంగా చంద్రబాబే చెప్పారని.. ఇప్పుడు ఎవరు జైలుకు వెళ్లాలో చెప్పాలని వీర్రాజు అంటున్నారు. హోదాతో ఒరిగేదేమీలేదని టీడీపీ సమావేశంలో చంద్రబాబు అన్నారన్నారు. హోదాకు, ప్యాకేజీకి మధ్య రూ.3వేల కోట్లే తేడా అని అన్నారని… ఈ విషయంలో చంద్రబాబును ప్రశ్నించాలని మీడియాను రెచ్చగొట్టారాయన. హోదా ఇచ్చిన ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి జరగలేదని స్వయంగా చంద్రబాబు చెప్పిన మాట. ఏపీకి ఏం కావాలో అడగకుండా పార్లమెంట్‌లో సీఎం రమేష్‌, సుజనా సమన్యాయం కావాలన్నారని అడిగారని వీర్రాజు చెబుతున్నారు. 
మేము కోరాం కాబట్టే భద్రాచలం డివిజన్ లోని కొన్ని ప్రాంతాలు ఏపీకి వచ్చాయని బీజేపీ చెబుతోంది. మొత్తంగా టీడీపీని ఇరుకున పెట్టాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చాయట. అంతే వీర్రాజుకు ఇక పండుగే. రెండు రోజులకు ఒకసారి మీడియా ముందుకు వచ్చి టీడీపీపై విరుచుకుపడుతున్నారు. మాటల యుద్దం పతాక స్థాయికి చేరుతోంది. 

1 Comment

  1. నీకు ,నీవాళ్ల కు మంచి ఇల్లు,వాకిలి కట్టుకోవడానికి సాయం చేస్తానని, కోటి రూపాయలు ఇస్తానని చిన్నోడికి హామీ ఇచ్చాడు పెద్దోడు. పాపం చిన్నోడు నమ్మాడు. కొంతకాలానికి కల్లబొల్లి కబుర్లు చెప్పి కోటి రూపాయలు ఒక్కసారే ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోవడం లేదు కాబట్టి పది దఫాలుగా కోటి ఇచ్చేస్తా అని బుజ్జగించాడు. కాలం గడుస్తుంది. గడువు ముంచుకు వస్తుంది. పెద్దోడి నుండి ఒక్క దఫా మాత్రం 5లక్షలు వచ్చాయి. అంతే ,మాటామంతీ లేదు. మొహం చాటేస్తున్నాడు పెద్దోడు. పాపం చిన్నోడు ఎన్నిసార్లు ఇంటికెళ్లినా ఇస్తాం … చేస్తాం .. అంటూ గుమ్మం నుండే బయటకు పొమ్మంటున్నారు.
    చిన్నోడికి సీన్ అర్ధమైంది. రకరకాలుగా బతిమాలాడు. ఏడ్చాడు. పెద్దోడి ఇంటి ముందు నానా రభస చేశాడు .
    పెద్దల సలహా తీసుకొన్నాడు. పంచాయితీ కి సిద్దమయ్యాడు . పెద్దోడి బుద్ధి బాగా తెలిసి వచ్చిన చిన్నోడు పంచాయితీ ముందు ఒక్కటే డిమాండ్ పెట్టాడు. ఇవ్వవలసిన కోటి రూపాయలు ఒక్కసారిగా ఇచ్చేయాలి “. వాయిదా పద్ధతులు,అడుక్కోవడాలు నేను పడలేను.
    ఇంతలో పెద్దోడి తాలూకా కొందరు కేతిగాళ్లు చేరి, ఆ… నువ్వు ముందు వాయిదా పద్ధతికి ఒప్పుకొన్నావ్!ఇపుడు మాట మారుస్తావా? అంటూ కిచ కిచ లాడుతుంటే , వెర్రి వినోదం కోసం విప్పార్చు కొంటూ గెంతే కొన్ని చానళ్ళు ఈ కేతిగాళ్ళ కోతి చేష్టలను గంట గంటకి చూపించడం మొదలెట్టారు.
    కానీ పంచాయితీ, తీర్మానం చేసి చిన్నోడికి ఇవ్వవలసిన కోటి రూపాయలు ఒకే దఫా ఇచ్చేయాలని తీర్పు చెప్పి న్యాయాన్ని నిలబెట్టింది.

Leave a Reply

Your email address will not be published.


*