ప్రత్యేక హోదా పై చంద్రబాబు అభిప్రాయాలు….

ప్రత్యేక హోదా వైపు సిఎం చంద్రబాబు నాయుడు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం చేస్తున్నారు తాజాగా టీడీపీ నేతలు. తమ స్టాండ్ మార్చుకునే ఆలోచన చేస్తోంది అధికార పార్టీ. మంచిదే. బీజేపీ మాటలు నమ్మి. ప్రజలే కాదు.. టీడీపీ మోసపోయింది. కమలం పెద్దల ఒత్తిడితో హోదా పై రకరకాలుగా మాట్లాడాల్సి వచ్చింది చంద్రబాబు. కానీ హోదా పై వివిధ సందర్భాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. హోదా కావాలని… వద్దని.. దాని కంటే మెరుగైనవి ఉన్నాయని చెబుతూ వచ్చారు. భారత జీడీపీ 6.7శాతం వృద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్‌ జీఎస్‌డీపీ 12శాతానికి పైగా వృద్ధి ఉందన్నారు సి.ఎం చంద్రబాబు. ఏపీలో రెండు భాగస్వామ్య సదస్సులు నిర్వహించిన చంద్రబాబు సర్కార్ రూ.15 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చేశాయని ప్రస్తావించారు. చంద్రబాబు వల్లనే ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నది నిజం. అందులో ఏ సందేహం లేదు. విదేశాలకు వెళ్లి మరీ పెట్టుబడులు తెచ్చారు. ఇంకా పలు కంపెనీలు ఏపీలో అడుగు పెట్టేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. హోదా కోసం పోరాటం చేసే వారిని అరెస్టులు చేయించడం, ఆందోళనలు వద్దని చెప్పడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. వివిధ సందర్భాల్లో చంద్రబాబు హోదా పై అన్న మాటలు ఇప్పుడు హాట్ టాపికయ్యాయి…
18.5.2016 – హోదాతో ఏం వస్తుంది? హోదా ఇచ్చి నిధులు ఇవ్వకపోతే ఏం లాభం? ఈశాన్యరాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి? 
19.5.2016 – హోదాతోనే అంతా కాదు. హోదా సంజీవని కాదు. అందుకే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ప్రధానికి విన్నవించా.  
11.9.2016 – ప్రత్యేక హోదావస్తే ఏం వస్తుంది? ప్యాకేజీ వద్దంటే అభివృద్ధి పనులకు ఆటంకం.  
16.9.2016 – హోదాతో పరిశ్రమలు రావు. పారిశ్రామిక రాయితీలకు హోదాకు సంబంధం లేదు. 
18.9.2016 – ప్రత్యేక హోదాతో ప్రయోజనం సున్నా. దానివల్ల పారిశ్రామిక రాయితీలు రావు. వస్తాయని నిరూపిస్తే దేనికైనా సిద్ధం 
23.9.2016 – హోదాకన్నా మెరుగైన ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ప్యాకేజీపై విస్తృత ప్రచారం చేయండి. 
4.2.2017 – హోదా వేస్ట్, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలలో పరిశ్రమలకు ప్రోత్సాహకాల్లేవు 
16.2.2017 – ప్రత్యేక హోదాతో ప్రయోజనం సున్నా. హోదాతో వచ్చేవన్నీ ప్యాకేజీలో ఇస్తామన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు లేక సోషల్ టీమ్ ఈ క్లిప్పింగ్స్ ను బాగా ప్రచారంలోకి తెచ్చింది. ఫలితంగా హోదా పై బాబు వాదన అంటూ వైరల్ అవుతోంది ఈ వార్త. 

1 Comment

  1. ఒక రాష్ట్ర నిర్మాణ బాధ్యత నెత్తిమీద ఉన్నపుడు, కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ వారిదగ్గర నుండి నిధులు,ప్రాజెక్ట్ అనుమతులు లౌక్యంగా తెచ్చు కోవలసి ఉన్నపుడు, వివిధ ఆలోచనలు,అభిప్రాయాలూ సమయానుగుణంగా, సందర్భానుసారం చేయవలసి ఉంటుందని అందరికి తెలుసు. ఏదిఏమైనా రాష్ట్ర నిర్మాణానికి అహరహం పనిచేస్తున్న చంద్రబాబు గారి చిత్తశుద్ధిని శంకించలేం .

Leave a Reply

Your email address will not be published.


*