పడక సుఖం అందిస్తేనే అవకాశాలా……

ఈ మధ్యకాలంలో క్యాస్టింగ్ కోచ్ పదం బాగా వాడుతున్నారు. ఎవరికి వారే హీరోయిన్లు తాము పడిన ఇబ్బందులను చెబుతున్నారు. పదుల సంఖ్యలో హీరోయిన్లు తాము లైంగిక వేధింపులకు గురయ్యామని చెప్పారు. ఇటీవల కాలం వరకు ఆ సంగతి బయటకు చెప్పేవాళ్లు కాదు. ఇప్పుడు దాచుకోవడంలేదు. పడక సుఖం అందిస్తేనే చాన్స్ లు వస్తాయనే విషయాన్ని బాహాటంగానే ఒప్పుకుంటున్నారు. కుటుంబ నేపధ్యం మంచిది అయితే సరే. లేకపోతే నిర్మాత, దర్శకుడు, హీరో లేక మరో వ్యక్తితో గడపాల్సి వస్తుందనేది వాస్తవం అంటున్నారు. 
హాలీవుడ్, బాలీవుడ్‌‌, టాలీవుడ్‌లోనూ ఇదే తీరు ఉంది. సినిమాల్లో అవకాశాల కోసం ఇలా చేస్తున్నారు. కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇంకొందరు మౌనంగా భరిస్తూ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. బాలీవుడ్ నటి రైమాసేన్ దీనిపై మాట్లాడారు. మన దగ్గర టాలెంట్ లేకనే పడక సుఖం అందించి అవకాశాలను తీసుకుంటున్నారని ఆ అందాల సుందరి అంటున్నారు. 
సుచిత్రసేన్ మనువరాలిగా.. మున్ మూన్ సేన్ కూతురే రైమాసేన్ పరిణిత. హానీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్, బాలీవుడ్ డైరీస్ లాంటి చిత్రాల్లో నటించింది. సినీ పరిశ్రమ నేపధ్యం ఉండటంతో తనకు ఇప్పటి వరకు లైంగిక వేధింపులు రాలేదని చెప్పింది. ఈ విషయంలో తాను చాలా అదృష్టవంతురాలిని చెప్పారు రైమాసేన్.
పడకగదిలోకి వెళ్తేనే సినిమాలో అవకాశాలు అనేది వారి వ్యక్తిగత ఇష్టాలపై ఆధారపడి ఉంది. మీ దగ్గర టాలెంట్ లేకుండా సైడ్ ట్రాక్‌లోకి వెళితే కొంతవరకే పని చేస్తోంది. ఆ తర్వాత అవకాశాలు రావన్నారు. కొంతమంది దర్శకులు పడుకుంటేనే సక్సెస్‌ను కట్టబెడతాం అనేది నిజం కాదు. నేను దాన్ని నమ్మను. ప్రతిభ లేకుండా మిగతా పనులతో పైకి రాలేరన్నారు. తప్పిని సరి పరిస్థితుల్లోనే కొందరు ఇలాంటి దిగజారుడు పనులు చేస్తున్నారని ఒప్పుకుంటున్నారామె. సినీ పరిశ్రమనే కాదు… అన్ని చోట్ల లైంగిక వేధింపులు ఉంటాయన్నారు. అందుకే ఈ విషయాన్ని బూతద్దంలో చూడవద్దని కోరారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*