కేసీఆర్ ను గౌరవ పూర్వకంగా పలకరించిన చంద్రబాబు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్‌ చేశారు. గతంలో ఉప్పు-నిప్పులా ఉన్న వీరిద్దరినీ కలిపిన ఘనత గవర్నర్ నరసింహన్ కే దక్కుతోంది. ఓటుకు నోటు కేసు ఇద్దరినీ వేరు చేసింది. కాలం వారిని సర్దుబాటు చేసింది. ప్రజల కోసం తాము కలిసి ఉన్నట్లుగా నటిస్తున్నారు. కడుపులో కత్తులు ఉన్నా..బయటకు చాలా మంచిస్నేహితులుగా కనపడుతున్నారు. గతంలో ఉన్నంత వ్యతిరేకత ఇద్దరి మధ్య లేదంటున్నారు సన్నిహితులు. ఇచ్చిపుచ్చుకోవడం ఇద్దరి మధ్య బాగానే సాగుతుంది. అమరావతి రాజధాని ప్రారంభోత్సవ వేడుకలకు కేసీఆర్ ను ఆహ్వానించిన చంద్రబాబు తన పెద్ద మనసును చాటుకున్నారు. ఆ తర్వాత తాను చేసిన యాగానికి చంద్రబాబును ఆహ్వానించారు. ఇలా ఇద్దరి మద్య రాకపోకలు ప్రారంభమయ్యాయి. 
వారిద్దరు రాజ్ భవన్ లోనే ఎనిమిది సార్లు కలిశారు.  కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు ఫోన్‌ చేసి మరీ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకల్ని తెలంగాణలోనే కాదు..ఏపీలోను చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ కేసీఆర్‌ అభిమాన సంఘం పేరిట గుంటూరు జిల్లా తెనాలిలో ఖాదిర్‌ అనే వ్యక్తి వేడుకల్ని నిర్వహించడం ఆసక్తికరమే. అక్కడే కాదు..గుంటూరులోను కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. 
ఓటు నోటు కేసు నుంచి చంద్రబాబును బ్రహ్మాది దేవతలు దిగివచ్చినా కాపాడలేరన్నారు కేసీఆర్. నన్ను అరెస్టు చేస్తే ఆ రోజు కేసీఆర్ సర్కార్ కు చివరి రోజు అని హెచ్చరించారు మరోవైపు చంద్రబాబు. అంతే ఎవరు నోరు మెదప లేదు. ఏం జరిగిందో తెలియదు. కేసీఆర్ మౌనం దాల్చారు. ఓటుకు నోటు కేసు దర్యాప్లు మూడు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు  అన్న చందంగా మారింది. 
విభజన పంపకాల విషయంలో ఇంకా సమస్యలు ఒక కొలిక్కి రాలేదు. అధికారుల స్థాయిలో చర్చలు కొనసాగిస్తూనే ఉన్నారు. సాగునీటి విషయంలో మంత్రుల స్థాయిలో పలుదఫాలుగా చర్చలు జరిగాయి. ప్రభుత్వం, పాలన పరంగా ఇద్దరు ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉంది. అదే సమయంలో వ్యక్తిగతంగాను పెద్దగా ఇబ్బంది లేకుండానే వారి మద్య ఉత్తర, ప్రత్యుత్తరాలు సాగుతున్నాయి. 
 
 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*