సోడ గోలీసోడ మూవీ రివ్యూ

రేటింగ్ : 2.5/5
నటీనటులు : మానస్, నిత్యా నరేష్, కారుణ్య, బ్రహ్మానందం, అలీ, కృష్ణభగవాన్, హైపర్ ఆది, గౌతం రాజు, చమ్మక్ చంద్ర తదితరులు 
సంగీతం : భరత్
నిర్మాత : డాక్టర్ భువనగిరి సత్య సింధూజ, శ్రీనివాస మూర్తిలు 
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం  : మల్లూరి హరిబాబు ( తొలి పరిచయం)
పరిచయ మాటలు….
పేరులోనే ప్రత్యేకత ఉంది. సోడా గోలీసోడా.. మొత్తం గ్యాస్ అనేది ట్యాగ్ లైన్. జర్నలిస్టుగా జీవితాన్ని ఆరంభించిన మల్లూరి హరిబాబు తన ఆలోచనలను ఈ సినిమాపై బాగానే పెట్టాడు. అలానే ప్రముఖ వైద్యురాలు డాక్టర్ భువనగిరి సత్య సింధూజ నిర్మాతగా ఉండటంతో అంచనాలు బాగానే పెరిగాయి. నందమూరి హరికృష్ణ ప్రత్యేక అతిధిగా ఆడియో ఫంక్షన్ జరగడంతో మరింతగా చర్చా సాగింది. 
లవ్ స్టోరీలకు ఇప్పుడు బాగానే డిమాండ్ ఉంది. దానికి కామెడీని జత చేస్తే ఇక సక్సెస్ కు తిరుగేలేదు. పేరుకు చిన్న సినిమా అయినా నవ్వుల పువ్వులు పూయించడంలో బాగుందనే చర్చ ముందే వచ్చింది. ప్రేమ కథకు ఓ మంచి మెసేజ్ ను జోడించిన సినిమానే సోడ గోలీ సోడ. ఎస్.బి క్రియేషన్స్ పతాకంపై చక్రసీద్ సమర్పించారు. మానస్, నిత్యా నరేష్, కారుణ్య హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్ర ట్రైలర్స్ కు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వాస్తవంగా ఈ మూవీ ఆకట్టుకుందా లేదా చూద్దాం.  
కథలోకి వెళితే….
శీను(మానస్) పేర్వారం గ్రామంలో దొంగతనాలు చేస్తూ బతికేవాడు. అతనికి సహకరించేందుకు ఓ బృందం ఉంటోంది. అలాంటి శీను అనుకోకుండా హైదారాబాద్ కు వస్తాడు. హీరో అవ్వాలనుకుంటాడు. తన దగ్గర డబ్బులేకపోయినా ఉన్నట్లు నాటకం ఆడతాడు. ఓ సినిమాకు హీరో కూడా అవుతాడు. సగం సినిమా పూర్తాయక అసలు సంగతి తెలుస్తోంది. అతను డబ్బున్న వ్యక్తి కాదు. నిరుపేద అని నిర్మాత తెలుసుకుంటాడు. ఫలితంగా సినిమా నిర్మాణం సగంలోనే ఆగుతోంది. 
మరో వైపు శీను పేర్వారం గ్రామ సర్పంచ్ కూతురు రూప(నిత్యా నరేష్)ను ప్రేమిస్తాడు. రూపకు శీను అంటే చాలా ఇష్టం. వారి పెళ్లికి ప్రెసిడెంట్ ఒప్పుకుంటాడు. కానీ ఇక్కడ చిన్న మెలిక పెడుతోంది హీరోయిన్. తమ పెళ్లి జరగాలంటే ఏం చేయాలనే అంశంపై కండీషన్ పెడుతుంది రూప. ఆ కోరిక తీర్చేందుకు శీను హైదరాబాద్ వస్తాడు. దొంగ శీనును ప్రెసిడెంట్ కూతురు ఎందుకు ప్రేమించింది. పెళ్లికి ఏం కండీషన్ పెట్టింది. దొంగ శీను హైదరాబాద్ వచ్చి ఎలా హీరోగా మారాడు. నిర్మాతగా మారేందుకు కారణం ఏంటి… అసలు సినిమా మధ్యలో ఎందుకు ఆగింది. చివరికి దొంగ శీను హీరో అయ్యాడా.. సినిమా పూర్తి చేశాడా… రూపను పెళ్లి చేసుకున్నాడా లేదా అన్నదే కథ. 
విశ్లేషణ….
దర్శకుడు మల్లూరి హరిబాబు మంచి కథ బాగా రాసుకున్నాడు. డైలాగ్స్ పేలాయి. యువతను దృష్టిలో పెట్టుకుని తాజా అంశాలను డైలాగ్స్ లో జత చేర్చారు. ఫలితంగా నవ్వుల జల్లు కురుస్తోంది. ఇటీవల కాలం ఇంతగా నవ్వుకున్న సినిమా గోలీసోడానే అవుతోంది. యూత్, లవర్స్, పెద్దలను ఈ కథలోకి తీసుకువచ్చి అందరినీ ఆకట్టుకునే పని చేస్తాడు హరిబాబు. హీరో హీరోయిన్ పాత్రల్ని తీర్చిదిద్దిన తీరు చాలా బాగుంది. ఒక దొంగ హీరోగా మారిన వైనం మధ్యలో కామెడీ అలరించింది. అదే సమయంలో మంచి మెసేజ్ ఇస్తూ కథను ముందుకు నడిపించాడు. మధ్య మధ్యలో ఆలీ, షకలక శంకర్, బ్రహ్మానందం కామెడీ కడుపుబ్బ నవ్విస్తోంది. దొంగ శీను గురించి చెప్పడంతోనే కథలోకి తీసుకెళ్లిన తీరు అద్భుతంగా ఉంది.  సందర్భానుసారంగా కామెడీ వస్తోంది. 
ఫస్టాఫ్ లో ఆలీ అండ్ గ్యాంగ్ సినిమా తీసేందుకు పడిన కష్టాలు అంతా ఇంతా కావు. ఇక మానస్ హీరోగా అయ్యేందుకు పడే కష్టాలు నవ్వు తెప్పిస్తాయి. వాస్తవానికి దగ్గరగా ఉండేలా సన్నివేశాల్ని తీర్చి దిద్దారు. ఆలోచనలను ఆచరణలో పెట్టిన ఘనత దర్శకుడు హరిబాబుకు దక్కుతోంది. ఇక హైపర్ ఆది, కృష్ణ భగవాన్, దువ్వాసి మోహన్, గౌతంరాజు, చమ్మక్ చంద్ర, బ్రహ్మీ కామెడీ అదుర్స్. పంచ్ డైలాగ్స్ అదిరాయి. సెకండాఫ్ లో హీరో మానస్, హీరోయిన్ నిత్య నరేష్ మధ్య మొదలయ్యే విలేజ్ లవ్ స్టోరీ చాలా బాగుంది. బ్రహ్మానందం ఎంట్రీ ఆసక్తికరంగా ఉంటోంది. బ్రహ్మీపాత్ర కాసేపే ఉన్నా… నవ్వించాడు. ప్రముఖ జర్నలిస్టు శేషగిరిరావు ఇందులో గడ్డంలో డాక్టర్ పాత్రతో ఇలా మెరిసి అలా వెళ్లిపోయాడు. ఎల్ఏం… ఏలే..ఎల్ యే..అనే సాంగ్ సినిమాకు ఊపు తీసుకొచ్చింది. మంచి మెసేజ్ తో దర్శకుడు సినిమాను ముగించాడు. అన్ని వర్గాల్ని మెప్పించే సన్నివేశాలతో గోలీసోడా బాగుంది. 
నటనా ప్రతిభ…
హీరో మానస్ పుల్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ చూపించాడు. డైలాగ్స్ తో పాటు డ్యాన్సులు అదిరిపోయాయి. హీరో, దొంగగా ఆకట్టుకున్నాడు. హీరోయన్ కారుణ్య ఉన్నంతలో పాత్రలో ఒదిగి పోయింది. సెకండాఫ్ లో నిత్యా నరేష్ తన పాత్రకు న్యాయం చేసింది. హీరో మానస్ తో మంచి కెమెస్ట్రీ కుదిరింది. భరత్ సంగీతం అద్భుతంగా ఉంది. పెద్ద సినిమాల్లోని పాటల్లా అవి ఉన్నాయి. రెయిన్ సాంగ్ బాగుంది. ముజీర్ మాలిక్  కెమెరా పనితనం బాగుంది. నిర్మాత భువనగిరి సత్య సింధూజ, శ్రీనివాస మూర్తిలు నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు మల్లూరి హరిబాబు జనాలకు మంచి మెసేజ్ ఇచ్చాడు. అన్ని వర్గాల్ని మెప్పించే చిత్రంగా గోలిసోడా ఉంది. హీరోయిన్స్ పెర్ పార్మెన్స్, కామెడీ, పాటలు, డైలాగ్స్ ప్రేక్షకుల్ని ఎంటర్ టైయిన్ చేశాయి. దర్శకుడి టేకింగ్, నిర్మాణాత్మక విలువలు ప్రేక్షకుల్ని కథలోకి ఇన్ వాల్వ్ చేయడం బాగుంది. 
ప్లస్ పాయింట్లు…
+ మానస్ నటన
+ కామెడీ
+ డ్రా బ్యాక్స్ 
+ కథనం
మైనస్ పాయింట్లు
– కెమెరా పనితనం
– కథనంలో లోపాలు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*