జగన్ వ్యూహాలకు చావుదెబ్బ!

అధికారికంగా ఇంకా సమాచారం బయటకు రాలేదు. కానీ తెలుగు ప్రపంచానికి సంగతి తెలిసిపోయింది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం హక్కుభుక్తంగా దక్కవలసిన వాటిని ఏర్పాటుచేసే విషయంలో నాటకాలు ఆడుతూ.. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి అంతా తమ బిచ్చమే అన్నట్లుగా బిల్డప్ లు ఇచ్చుకోడానికి తెగబడుతున్న కేంద్ర ప్రభుత్వం మీద సంధించడానికి … తెలుగుదేశం సర్కారు ఎలాంటి బ్రహ్మాస్త్రం సిద్ధం చేసుకుని ఉన్నదో బయటి ప్రపంచానికి తెలిసిపోయింది. ఉన్నపళంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించి అటు కేంద్రాన్ని ఇటు రాజకీయ ప్రత్యర్థుల్ని ఉక్కిరి బిక్కిరి చేసేయాలని చంద్రబాబు తలపోశారు గానీ.. విషయం లీక్ అయింది.

మార్చి 5వ తారీఖున ఎన్డీయే కూటమినుంచి బయటకు రావడానికి తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి వారు ఏం సాయం చేస్తారో… అప్పటిదాకా ఎదురుచూసిన తర్వాత.. ఆరోజున షాక్ ఇవ్వాలని తెలుగుదేశం నిర్ణయించుకుంది. బడ్జెట్ సమావేశాలు ముగిసేరోజున అంటే ఏప్రిల్ 6న తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించబోతున్నట్లుగా జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండేళ్ల ముందే బడ్జెట్ సమావేశాల తర్వాత తమ వారి రాజీనామాలు ఉంటాయని చెప్పిన జగన్.. తీరా.. ఇప్పుడు నిష్ఫలమైన సమయంలో.. ఆ నిర్ణయం తీసుకున్నారు.

అయితే కేంద్రలోని అధికార కూటమినుంచి వైదొలగాలనే నిర్ణయం తీసుకోవడం ద్వారా, జగన్ వ్యూహాన్ని తెలుగుదేశం చావుదెబ్బ కొట్టినట్టే అవుతుందని అంతా భావిస్తున్నారు. ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలు రాజీనామా చేసేసి, తెదేపా పదవుల్లోనే, ఎన్డీయేలోనే  ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు గానీ.. జగన్ బ్యాచ్ కంటె నెల రోజుల ముందుగా మార్చి 5వ తేదీనే తెదేపా రాజీనామాలకు సిద్ధపడడం ఖచ్చితంగా పైచేయి అవుతుందని అంతా అనుకుంటున్నారు.

ఈ డెడ్ లైన్ మరియు రాజీనామాలు, కూటమినుంచి వైదొలగడం అనే ప్రక్రియను ఏ రకంగా ముందుకు తీసుకువెళ్లాలనే విషయంలో చంద్రబునాయుడు పార్టీ సీనియర్లతో రెండు మూడురోజులుగా మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. అంతిమంగా బుధవారం నాటికి ఓ సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చారు. అయితే వారు దానిని గుంభనంగానే ఉంచదలచుకున్నారు గానీ.. మంత్రి ఆదినారాయణ రెడ్డి కడపజిల్లా సమావేశంలో విషయం బయటపెట్టేశారు. ఈ నిర్ణయంతో భాజపాకు పెద్ద బెడద లేదు. ఎటూ  మార్చి 5 లోగా రాష్ట్రానికి ఏదో ఒక స్పష్టమైన సాయం అందించగలిగితే.. ఇవేవీ ఉండవని వారికి తెలుసు. అయితే.. రాజీనామాలు అనే మాట చెప్పేసి.. ఏదో మైలేజీ వచ్చేస్తుందని భ్రమపడిన వైకాపాకు మాత్రం.. ఈ నిర్ణయం ఖచ్చితంగా భంగపాటు అని పలువురు భావిస్తున్నారు.

3 Comments

  1. Jagan cheppina tharvathe kada tdp vallu resign chesthanani chepthundi.jagan okka matatho centre lo ministrys vadilesukovalsina paristhithi vachindi tdp ki.evaru gelicharo cheppu.

    • Meeru eniana cheppandi, e website gadiki budhi radhu. Maa babu ante maaku kamma anthe. Anni vidhala fail ayyadu babu gadu aina maa vade goppa ane rakalu veelu. Modi ne sariyina mogadu velliki, chukkulu choopisthunnadu 40 years experience gadaki. Antha bajan brundale, papers, news channels, websites annitini konesi nene goppa ane vadaki vadu certificate ichukuntunnadu ketu CBN.

  2. ఈ ప్రపంచంలో Aks ఒక్కరే మేధావి, మిగిలిన వారందరూ రాహుల్సే.

Leave a Reply

Your email address will not be published.


*