టీడీపీ శ్వేతపత్రం ఇవ్వదట

పోలవరం ప్రాజెక్టు లెక్కల్లో తప్పులు ఉన్నాయనే ప్రచారం మొదటి నుంచి ఉంది. ఏపీ ప్రభుత్వం చెప్పేది ఒకటి. చేసేది మరోకటి అని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి మొదటి నుంచీ వాదిస్తూనే ఉంది. సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివరావుతో పాటు.. ఉండవల్లి అరుణ్ కుమార్ అదే మాట చెప్పారు. ఆ తర్వాత కొత్తగా రంగంలోకి వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోలవరం సందర్శించారు. వాస్తవంగా ఏం జరిగింది. ఏంటనే విషయం పై శ్వేత పత్రం ఇవ్వాలని కోరారు. ఇందుకు చంద్రబాబు సర్కారు ఒప్పుకోవడం లేదు. దేనికి ఎంత నిధులు కేటాయించారో చెప్పలేకపోతోంది. అదే చెబితే పర్సెంటేజీల బాగోతాలు వెలుగులోకి వచ్చే వీలుంది. అది రావడం చంద్రబాబుకు ఇష్టం లేదంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ట్రాన్స్ ట్రాయ్ నుంచి పెద్ద మొత్తంలో కాంగ్రెస్ సర్కారు ముడుపులు తీసుకుందనే ప్రచారముంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక మరికొంత మొత్తంలో కావాలని అడగడమే అసలు సమస్యకు మూల కారణమంటారు. అందుకే ట్రాన్స్ ట్రాయ్ ను తప్పించి మరొకరిని రంగంలోకి తెప్పించారనే విమర్శలు లేకపోలేదు.
ఆ సంగతి పక్కన పెడితే పోలవరం ఖర్చుల పై శ్వేత పత్రం ఇవ్వాలని జనసేన అదినేత పవన్ కళ్యాణ్  గట్టిగానే కోరారు. పవన్ మూడు జన్మలెత్తినా శ్వేత పత్రం ఇచ్చేది లేదంటోంది టీడీపీ. ఫలింతగా అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ విషయంలో తెలుగుదేశం పవన్ కల్యాణ్ కు మొండి చేయి చూపనుంది. టీడీపీ సీనియర్ల అంతర్గత సంభాషణల్లో ఇదే అంశం చర్చనీయాంశమైంది. పట్టిసీమలో వచ్చిన డబ్బులు నంద్యాలకే సరిపోలేదు. అంతే కాదు రేపు ఎన్నికల కోసం పెద్ద మొత్తంలో కావాలంటున్నారు. పోయినసారి ఎన్నికల్లో పెద్ద మొత్తంలో ఇచ్చి మంత్రి నారాయణ ఆదుకున్నారనేది టీడీపీ నేతలు చెప్పే మాట. ఎంతిచ్చారు. ఏంటనేది బయటకు పొక్కలేదు.  
ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు సంబందించి శ్వేతపత్రం విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ కోరినా పట్టించుకునే వారే ఉండరంటున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అనధికారికంగా ఇదే మాట చెబుతున్నారు. పోలవరం పనులు బాగా సాగుతున్నాయని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు కోసం రూ.12,915 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచామనేది ఆయన చెప్పే మాట. వెబ్ సైట్ లో పూర్తి వివరాలు లేవని జేపీ, ఉండవల్లి, పవన్ కల్యాణ్ లు చెబుతున్న సంగతి. ప్రాజెక్టు పురోగతి పై బీజేపీ పెద్దలు అనుమానాలు వ్యక్తం చేశారు. 
పోలవరం ప్రాజెక్టుకు అంత ఖర్చు చేసినప్పుడు ఏ విబాగానికి ఎంత ఖర్చు అయింది. కేంద్రం ఎంత ఇచ్చింది.ఇందులో ఇతర ఖర్చులు కూడా కలిపి చూపుతున్నారనే వాదన వస్తోంది. అందుకే ఈ విషయాలను నిర్దిష్టంగా చూపాలేరంటున్నారు. పవన్ కళ్యాణ్ టీమ్ ఈ విషయంలో పెద్ద ఎత్తున పరిశోధన చేసినా తేలే అంశం ఏం లేదు. అందుకే శ్వేత పత్రం అడగక పోతేనే మంచిదంటున్నారు. పరిపాలనలో పారదర్శకత కోసం గతంలో ప్రభుత్వాలు శ్వేత పత్రం ఇచ్చేవి. తాము తప్పు చేయడం లేదని చెప్పేవి. కానీ ఆ సంస్కృతిని చంద్రబాబు సర్కార్ పాటించక పోవడం అనుమానాలకు మరింతగా పెంచుతోంది. 

1 Comment

  1. నువ్వే పోలవరం మొత్తం లెక్కలు రాసినట్లుగా, బాబు నీ ముందే పర్సెంటేజీ లు తీసుకున్నట్లుగా చెబుతూ వున్నావు. నువ్వే ఒక నలుపు దో, తెలుపు దొ, ఒకటి తయారు చేసి పవన్ కి ఇస్తే సరి పోతుంది. ఇంతకు ముందు, ప్రభుత్వాలు ఎవరన్నా ఇచ్చారా? ప్రతి ఎదవ శ్వేతా పత్రం అడిగే వాడే. రాజకీయ ప్రయోజనాలకు ఇది అడగటం జబ్బుగా మారింది. ఆర్టీఐ ఆక్ట్ కింద డబ్బులు కట్టి వివరణ తీసుకొనే పద్ధతి వుందిగా. వాడుకోండి.

Leave a Reply

Your email address will not be published.


*