పవన్ నటనకే కాదు.. రాజకీయాలకు పనికిరాడట

కత్తి మహేష్ నే కాదు… బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి అదే మాట చెప్పాడు. పవన్ కల్యాణ్ నటనకే కాదు.. రాజకీయాలకు పనికిరాడని తేల్చాడు. పవన్ కల్యాణ్ కు అసలు నటనే చేతగాదన్నారు. ప‌వ‌న్‌ కల్యాణ్ ను టార్గెట్‌ చేసి మరీ ఈ వ్యాఖ్య‌లు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇటు కేసీఆర్, అటు చంద్రబాబు పాలన భేష్ అని మెచ్చుకున్న రోజునే పవన్ కల్యాణ్ రాజకీయంగా రాంగ్ స్టెప్ వేశారు. ఇప్పుడు ఎంత చెప్పినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మరోవైపు చంద్రబాబు శత్రువులుగా ఉన్న సిపిఐ, లోక్ సత్తా, ఉండవల్లితో చేతులు కలిపాడు పవన్. అందుకే అసలు రాజకీయాల్లో అతని చర్యలు ఊహాతీతం అంటున్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి కొన్నాళ్లయినా పార్టీ నడిపారు అన్నయ్య చిరంజీవి. తమ్ముడు అది నడపలేడని తేల్చేశాడు కిషన్ రెడ్డి. అన్న చిరంజీవిని అడ్డంపెట్టుకొని పవన్‌ సినిమా యాక్టర్ అయ్యారనేది నిజం. 
చిరంజీవి లేకపోతే పవన్ యాక్టర్ అయ్యేవాడు కాదు. అదే సమయంలో రాజకీయాల్లోను మీడియా మద్దతుతో నాయకుడు అవుదామనుకుంటున్నారని కిషన్‌రెడ్డి గాలి తీసేశాడు. పవన్ కంటే చిరంజీవి కొడుకు రాంచరణ్ మంచి నటుడు అని కిష‌న్‌రెడ్డి చెప్ప‌డం పుండు మీద కారం రాసినట్లు ఉంది. క‌త్తి మ‌హేష్ ను అంత పెద్దవాడిని చేసింది కేవలం మీడియానే అని చెప్పడం మరో ఆశ్చర్యం. 
ఉరుము లేని పిడుగులా కిషన్ రెడ్డి పవన్ కల్యాణ్ మీద పడటం వెనుక పెద్ద వ్యూహమే ఉందట. బీజేపీతో ఎలాగు కలిసిపోయేందుకు జనసేన సిద్దంగా లేదనే సంకేతాలు అందుతున్నాయి. అందుకే పవన్ కల్యాణ్ టార్గెట్ గా బీజేపీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*