యార్లగడ్డకు అమెరికాలో ఘన సన్మానం

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, పద్మశ్రీ, పద్మ భూషణ్, రాజ్యసభ మాజీ సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ను తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ బోస్టన్ (టిఏజిబి) ఘనంగా సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ అధ్యక్షుడిగా ఉన్న యార్లగడ్డ తెలుగు, హిందీ బాషలో చేసిన సాహిత్య సేవకు మెచ్చి ఇలా చేశారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ సాంస్కృతిక సాహితీ రాయబారిగా అనేక దేశాలకు తిరిగిన సంగతి తెలిసిందే. అమెరికా,  మలేసియా, కెనడా, ధాయ్ లాండ్, సింగపూర్, ఇంగ్లాండ్, ప్రాన్స్, మారిషన్, రష్యా వంటి అనేక దేశాల్లో పర్యటించిన యార్లగడ్డ తెలుగు సంస్కృతి సంప్రదాయాలను వ్యాపింపజేసేందుకు తన వంతుగా ప్రయత్నిస్తున్నారు. అందుకే  ప్రొపెసర్ ముదిగొండ శివప్రసాద్ రచించిన పట్టాభి అనే ప్రముఖ చారిత్రిక నవలను యార్లగడ్డకు అంకితమిచ్చిన సంగతి తెలిసిందే. 
లోక్ నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడిగా ఉన్న యార్లగడ్డ తెలుగులో 32 పుస్తకాలను రచించిన సంగతి తెలిసిందే. కేంద్రీయ హిందీ సమితి అధ్యక్షులైన ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సేవలను అమెరికాలోని మసాచూసెట్స్ లోని బెడ్ఫోర్డ్ నగరానికి చెందిన తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ బోస్టన్ (TAGB) గుర్తించింది. ఆయన సేవలను మెచ్చుకుంది. తెలుగు అసోసియేషన్ పాలకమండలి సభ్యులు శశి కాంత్ వల్లిపల్లి, శ్రీనివాస్ కొల్లిపర, శ్రీనివాస్ బచ్చు, మణిమాల చెలుపాది, సీతారాం అమరవాది, మూర్తి కన్నెగంటి, రామకృష్ణ పెనుమర్తి, శంకర్ మగపు, పద్మ పరకాల, చంద్ర తాళ్ళూరితో పాటు…ఇతర కమిటీ సభ్యులు ఆయన్ను సత్కరించిన వారిలో ఉన్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*