స‌మంత‌కు యూటర్న్ క‌లిసి వ‌చ్చేనా…

రాజుగారి గ‌ది-2లో స‌మంత చేసిన క్యారెక్ట‌ర్ కు మంచి గుర్తింపే వ‌చ్చింది. దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఓంకార్ రెట్టించిన ఉత్సాహంతో మ‌రో సినిమా మొద‌లు పెట్టే ప‌నిలో ప‌డ్డాడు. రాజు గారి గ‌ది-2లో న‌టించే స‌మ‌యంలో క‌న్న‌డంలో విడుద‌లై సక్సెస్‌ అయిన యూటర్న్ స‌మంత‌కు బాగా న‌చ్చిందట‌. ఎలాగైన తెలుగులో దాన్ని రీ మేక్ చేసి తాను న‌టించాల‌ని భావించింది. ఈ మేర‌కు తన సన్నిహితులతో సినిమా రైట్స్ కొనిపించింది. ఈ సినిమాను ప‌ట్టాలు ఎక్కించేందుకు స‌మంత ప్రయ‌త్నాలు మొద‌లు పెట్టింది. ఓంకార్‌నే ద‌ర్శ‌కుడిగా పెట్టాల‌ని ఆమె భావించింది. అయితే ఇంత‌లో యూటర్న్‌ చిత్రాన్ని సమంత కాకుండా మరో నిర్మాతకు హ‌క్కులు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. స‌ద‌రు నిర్మాత కూడా ఓంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంతోనే సినిమా రూపొందించాల‌ని ఫిక్స్ అయ్యాడ‌ట‌. హర్రర్‌ చిత్రాల దర్శకుడిగా మంచి క్రేజ్‌ను దక్కించుకున్న ఓంకార్ అయితే బెట‌ర్ అని నిర్మాత భావిస్తున్నాడు. బాధ్య‌త‌లు కూడా అప్ప‌గించాడు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ చిత్రంలో స‌మంత న‌టించాల‌ని స‌ద‌రు నిర్మాత కోరాడ‌ట‌. ఈ మేర‌కు యూటర్న్‌ రీమేక్‌ కోసం స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్న దర్శకుడు ఓంకార్‌ ఈ విషయాన్ని సన్నిహితుల వద్ద తేల్చి చెప్పాడు. సమంత ఎంతో ఇష్టపడి రీమేక్‌ చేయాలనుకుంటున్న యూటర్న్‌ సమ్మర్‌లో సెట్స్‌పైకి వెళ్లబోతుంది. ప్రస్తుతం సమంత చేస్తున్న చిత్రాలు పూర్తి అయ్యి, విడుదలైన తర్వాత యూటర్న్‌ మొదలు పెట్టాలని ఇన్నాళ్లు ఎదురు చూసింది. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని సినీ వర్గాల వారు చెబుతున్నారు. స‌మంత ఇష్ట‌ప‌డి చేస్తున్న ఈ సినిమా ఎంత వ‌ర‌కు క‌లిసి వ‌స్తుందో చూడాల్సిందే….

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*