పెళ్లి పీట‌లు ఎక్క‌నున్న శ్రియ‌…

గ్లామర్‌ బ్యూటీ శ్రియ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అందాల‌ను మెరుగుపర్చుకుంటూ యువ‌కుల గుండెల్లో గిలిగింత‌లు పెడుతుంటుంది. ఇండస్ట్రీకి వచ్చి 15ఏళ్ళు దాటిన ఇప్పటికి ఈ అమ్మడు అభిమానులకి కొత్తగానే కనిపిస్తుంటుంది. ఇటీవల గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రంలో వశిష్టి దేవిగా నటించిన శ్రియ తన నటనతో ఆడియన్స్‌ ని కట్టిపడేసింది. ఆ తర్వాత మళ్లీ బాలయ్యతో పైసా వసూల్‌ చేసింది. ఇటీవ‌లె విడుద‌లైన గాయ‌త్రిలో కూడా మంచి క్యారెక్ట‌ర్ చేసింది. ఇటు తెలుగు, అటు తమిళంలో మంచి నటిగా పేరుతెచ్చుకున్న శ్రియ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. శ్రియ యేడాది క్రితం సినిమా షూటింగ్ కోసం ర‌ష్యా వెళ్లింది. అక్క‌డ ఓ యువ‌కుడిని చూసి మ‌న‌సు పారేసుకుంది. పాపం ఆ కుర్రాడు కూడా ఆమె ప్రేమ‌లో ప‌డిపోయాడు. యేడాది పాటు సాగిన వీరి ప్రేమాయ‌ణం ఇక పెళ్లి అనే ప‌ట్టాలు ఎక్క‌నుంది. ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీక‌రించడంతో.. మార్చిలో శ్రియ పెళ్లి చేసుకోనుంది. రాజస్థాన్‌ వేదికగా జ‌రిగే డెస్టినేష‌న్ పెళ్లికి ఏర్పాట్లు ఇప్ప‌టికే మొద‌ల‌య్యాయి. ర‌ష్య‌న్ అబ్బాయితో భార‌తీయ యువ‌తి వివాహం ఎలా జ‌ర‌గ‌బోతుంది అనేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌. పెళ్లి త‌రువాత న‌ట‌న కొన‌సాగిస్తుందా లేదా అనేది శ్రియ ఇంకా తేల్చుకోలేక‌పోతుంద‌ట‌. ఈ అమ్మడు పెళ్లి చేసుకొని ర‌ష్యాకు చెక్కెస్తే మ‌రి కుర్ర‌కారు ఏమైపోతారో….హ‌త‌విధి….

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*