బుట్టా రేణుక పై వేటుకు రెడీ

పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎంపీలపై చర్యలకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ మేరకు లాభదాయక పదవిలో ఉన్న వారిపై దృష్టి పెట్టింది. ఢిల్లీ అసెంబ్లీకి చెందిన ఎమ్మెల్యేలపై అదే అంశంపై వేటు వేసిన కేంద్రం ఇప్పుడు మిగతా వారిపై కన్నేసింది. ముఖ్యంగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుకపై అనర్హత వేటు వేయాలని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. ఆమె లాభదాయక పదవిలో ఉన్నారని కమిటీ విచారణలో తేలింది. వాస్తవంగా బుట్టా రేణుకతోపాటు.. ఎస్పీవైరెడ్డి, కొత్తపల్లి గీతలపై చర్యలు తీసుకోవచ్చు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఇందుకు ఉపయోగపడుతోంది. కానీ ఆ చర్య తీసుకునే సాహసం చేయడం లేదు పార్లమెంటు. కేంద్ర ప్రభుత్వం ఆమెను సాంఘీక సంక్షేమ బోర్డులో నియమించింది. అది లాభదాయక పదవి. అందుకే ఆమెను తొలగించే పని చేయనుంది. అసలు ఆ పదవి ఇచ్చిందే కేంద్రం. కానీ తొలగిస్తోంది కేంద్రమే. ఆశ్చర్యంగా బుట్టా రేణుక ఆ పదవితోనే ఎంపీగా అనర్హత వేటు పడే అవకాశముంది. 
లాభదాయక పదవి పేరుతో కేంద్ర స్థాయిలోకాని, న్యాయ వ్యవస్థ కాని, ఎన్నికల సంఘం కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే చాలా మంది పదవులు ఊడినట్లే. తనకు వద్దన్నా ఆ పదవి కట్టబెట్టారు. ఇప్పుడు తనపై వేటు వేసేందుకు సిద్దమయ్యారనేది బుట్టా రేణుక వాదనగా ఉంది. ఒక పార్టీ పక్షాన ఎన్నికై ఆ పదవికి రాజీనామా చేయకుండా సిగ్గు ఎగ్గు లేకుండా మరో పార్టీలో చేరినప్పుడు ఇవి కనిపించలేదా అంటున్నారు ఇంకోవైపు జనాలు. నైతిక విలువలకు కట్టుబడతానని పార్లమెంటులో ప్రమాణం చేసిన బుట్టా రేణుక ఆ విలువలకు పాతరేస్తే చర్యలు తీసుకోవడంలో తప్పులేదు. కాకపోతే పార్టీ ఫిరాయింపుల అంశం కాకుండా లాభదాయక పదవి పేరుతో తొలగించనుండటం ఆసక్తికరంగా మారింది.  
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*