పవన్ కు కులం రంగు పూసే ప్రయత్నం

పవన్ కల్యాణ్ పెద్దగా కులాలను పట్టించుకోడు. తనకు అంతా ఒక్కటే అని చెబుతారు. అంతా నిజమే అనుకుంటున్నారు. కానీ ఈ మధ్య పవన్ పై కొత్త విమర్శలు వస్తున్నాయి. ఆయన ఆఫీసులో పనిచేసే చాలా మందిని కులాలను చూసి గౌరవిస్తారని అనే ప్రచారం ఉంది. ఆ పార్టీ పిఆర్వో హరి ప్రసాద్ మొదలుగొని చాలా మంది అదే పద్దతిలో ఉంటారనే వాదన గతం నుంచే వస్తోంది. మిగతా కులాల వారు పవన్ ఆఫీసులో పని చేసేందుకు వస్తే తీసుకోరంటారు. ఇక తప్పని సరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వస్తే ముందస్తు జాగ్రత్తలు చెప్పి మరీ ఉద్యోగంలోకి తీసుకుంటున్నారనే చర్చ సాగుతోంది. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు పవన్ కల్యాణ్ చేసే పనులు కులాల పరంగా ఉందంటున్నారు. సినిమాలకు ఆయన రెస్ట్ ఇచ్చారు. అజ్ఞాతవాసి ఆడకపోవడంతో నిరాశ చెందిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. సూపర్ హిట్ తో సినిమాలకు ముగింపు పలుకుదామనుకున్నా అది కుదరలేదు. 
అయితే పవన్ హీరోగా సినిమాలు చేయకపోయినా ఓ సినిమాని నిర్మిస్తున్నాడ‌ు. నితిన్ హీరోగా తెర‌కెక్కుతోన్న చిత్రంకు చ‌ల్ మోహ‌న‌రంగా పేరు పెట్టారు. మాట‌ల మాంత్రికుడు, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌ దీనికి దర్శకుడు. ప‌వ‌న్ క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై ప‌వ‌ర్ స్టార్ ఈ సినిమా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్‌పై ఇప్పుడు వివాదం రగులుతోంది. వంగవీటి మోహ‌న‌రంగ పేరు విజయవాడలో రాజకీయ నేతది. ఆ పేరు చెబితేనే కాపు సామాజిక వర్గం రక్తం మరిగిపోతోంది. అంతగా ఆయన్ను ప్రత్యర్థి వర్గం హతమార్చింది. ఆందోళన చేస్తున్న ఆయన్ను టెంట్ లోనే కత్తులతో నరికేశారు వైరి వర్గీయులు. కాపు సామాజిక వ‌ర్గం నేత‌గా బల‌మైన ముద్ర వేసిన వంగ‌వీటి మోహ‌న‌రంగ‌ పేరును ఈ సినిమాకు పెట్టడం వెనుక పవన్ కల్యాణ్ సూచన ఉందంటున్నారు. 
కులాలు, మతాలకు తాను అతీతుడని చెప్పుకునే పవన్ కల్యాణ్ అంతర్గతంగా కులాలను పట్టించుకుంటారనే ప్రచారం చేస్తోంది వైరి వర్గం. ప‌వ‌న్ క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌తో ప‌వ‌న్ ఓ నిర్మాత‌గా నిర్మిస్తోన్న సినిమాకు ఇలా కాపు నేత పేరు పెట్టడం వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నించడమే అంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*