రాహుల్ ఏం చేసినా వివాదమే అవుతోంది…

పాపం రాహుల్ గాంధీ. మంచి చేద్దామని అనుకుంటాడు. కానీ అది ఏదో ఒక విధంగా వివాదమై కూర్చోంటోంది. ఫలితంగా ఆయన ఏం చేసినా ఎదురు తిరుగుతోంది. ఆ మధ్య ఓ మహిళా అభిమాని ఆయనకు ముద్దు పెట్టింది. అసలు రాహుల్ కు ఆ ముద్దుతో సంబంధం లేదు. ఆ సంగతి జాతీయ వ్యాప్తంగా మారు మోగింది. అటు భర్తతో పాటు చుట్టుపక్కల వారు సూటి పోటి మాటలు అన్నారు. ఆ బాధ భరించలేక ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. రాహుల్ పాత్ర లేకపోయినా అతన్ని ఆడిపోసుకున్నారు అంతా. అమ్మాయి ముద్దు పెడుతుంటే చూస్తు ఊరుకుంటావా అని తిట్టి పోశారు. 
ఆ తర్వాత ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లిన రాహుల్ గాంధీ పొరపాటున మహిళల బాత్రూమ్ కు వెళ్లారు. అంతే అంతా ఆయన్ను సిగ్గులేదా అని తిట్టి పోశారు. అతనికి హిందీ అక్షరాలు అర్థం కాక మహిళల బాత్రూమ్ కు వెళ్లాడు. అప్పుడే కాదు.. పార్లమెంటు సమావేశాలు సీరియస్ గా జరిగే సమయంలో సభను వదిలి పెట్టి నెల రోజులకు పైగా విశ్రాంతి తీసుకున్నారు. అధికార పార్టీని ఇరుకున పెట్టాల్సిన సమయంలో సాము విడిచి పారిపోయాడనే ప్రచారం వచ్చింది. 
అలానే పెద్దనోట్ల రద్దుతో జనం ఎన్ని అవస్థలు పడ్డారో చూడండని రాహుల్‌ ఓ ఫొటో పెట్టి మరీ ట్వీట్‌ చేశారు. అందులో ఓ పెద్దాయన. బ్యాగ్రౌండ్‌లో బ్యాంకుల ముందు క్యూకట్టిన జనం ఉన్నారు. పెన్షన్‌ కోసం తిరగలేక ఎంత ఇబ్బంది పడ్డాడోనని.. ఇలాంటి వాళ్లు దేశంలో చాలామంది ఉన్నారనేది రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ప్రజల కన్నీళ్లు ప్రభుత్వానికి మంచిది కాదు. అవి సముద్రాలుగా ఉప్పొంగితే మీరు కొట్టుకుపోతారు అనే అర్థం వచ్చేలా హిందీలో రాశారు రాహుల్‌. ఆ ట్వీట్ తో రాహుల్ పరువు పోయింది. ఆ ఫొటోలో ఉన్నది ఓ మాజీ జవాన్. పేరు నంద్‌లాల్. ఉండేది గుర్గావ్‌లో. ఆయన ఇంటికి వెళ్లిన మీడియాకు అసలు విషయం తెలిసింది. ప్రధాని మోడీ మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. నోట్ల రద్దును వ్యతిరేకించే వారిని ఉగ్రవాదులుగా అభివర్ణించారు. ఫొటో పెట్టేటప్పుడు వెనుకా ముందూ చూడాలి. అలా చేయక పోవడం వల్ల వచ్చిన తిప్పలు ఇవి. అసలే పెళ్లి కాని ప్రసాద్, పప్పుశుద్ద అంటున్నారు జనాలు. 
ఈ మధ్య తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడ రాహుల్ గాంధీ మీద సెటైర్ వేశారు. నేను పెళ్లి చేసుకున్నా. కనీసం రాహుల్ గాంధీకి పెళ్లి కాలేదు. అందుకే అతనే పప్పుశుద్దా అంటూ తనపై వచ్చిన విమర్శలకు సమాధానంగా చెప్పారు కేటీఆర్. ఈ సోది అంతా ఎందుకు అసలు పాయింట్ కు వద్దాం. 
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈ మధ్య గుళ్లు, గోపురాలు తిరుగుతున్నారు. స్వామి, అమ్మవార్లకు దండాలు పెట్టి మరీ పూజలు చేస్తున్నారు. చేయిస్తున్నారు. కానీ ఈ మద్య ఆయన చేసిన నిర్వాహకంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. గుజరాత్‌ ఎన్నికల సందర్భంగా రాహుల్‌ ‘టెంపుల్‌ రన్‌’ చేశారు. ఇప్పుడు కర్ణాటకలోనూ రాహుల్‌ ఆలయాలను దర్శించుకుంటున్నారు. అందుకే ఆయన్ను ‘ఎన్నికల హిందువు’గా భావిస్తున్నారు. 
ఆయన ’జవారీ చికెన్‌’ తిని ఆలయానికి వెళ్లారని కర్ణాటక బీజేపీ చీఫ్‌ బీఎస్‌ యడ్యూరప్ప చేసిన ఆరోపణ. సీఎం సిద్దరామయ్య చేపల కూర తిని.. ధర్మస్థల మంజునాథుడిని దర్శించుకున్నారనే విమర్శలు గతంలో వచ్చాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ అలానే మాంసం తిని నరసింహస్వామిని దర్శించుకున్నారని యడ్యూరప్ప ట్విట్టర్‌లో తిట్టి పోశారు. ‘హిందువుల మనోభావాలను కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు గాయపరుస్తోందనే చర్చ సాగుతోంది. రాహుల్‌ నరసింహస్వామిని దర్శించుకున్న ఫొటోలతో పాటు… నాన్ వెజ్ తింటున్న ఫొటోలను ఆయన ట్వీట్‌ చేశారు. ఇప్పుడీ అంశం బీజేపీకి ఎంత వరకు ప్రయోజనం చేకూరుస్తుందో చూడాలి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*