హస్తిన బాటపట్టనున్న చంద్రబాబు

తాడో పేడో తేల్చుకోనున్నారు సిఎం చంద్రబాబు. ఏపీ అవసరాల కోసమే కాదు..తన రాజకీయ ప్రయోజనాల కోసం హస్తినకు వెళుతున్నాడు. ఇక బీజేపీతో పొత్తునా లేక దోస్తీనో ఈ పర్యటనతో తేలనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతోను మాట్లాడనున్నారు. ఈనెల 15న ఆయన ఢిల్లీ వెళ్లేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.  బిజెపి, టిడిపి ల మద్య మాటల యుద్దం తీవ్రమైంది. మేము ఇంతిచ్చామని కేంద్రం. కాదు కొంతే ఇచ్చారని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. ఫలితంగా నిజం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. అమరావతి రాజధాని నిర్మాణానికి 2500 కోట్ల రూపాయలు ఇచ్చామని కేంద్రం చెప్పింది. కాదు కాదు కేవలం ఇచ్చింది రూ.1500 కోట్లేనని రాష్ట్రం చెబుతున్న మాట. 
అదే కాదు..విభజన హామీలు, అమలు, వివిధ ప్రాజెక్టులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన నిధుల విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. అసలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో శ్వేత పత్రం ఇచ్చేందుకు భయపడుతోంది టీడీపీ సర్కార్. అంతా ఆన్ లైన్ లో ఉన్నాయని చెబుతోంది. అది ఓపెన్ చేస్తే వివరాలే లేవంటున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వంటి వారు. నిజం నిగ్గు తేల్చేందుకు జేఎప్ సి పేరుతో పవన్ కల్యాణ్, జేపీ, ఉండవల్లిలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నిజాలు బయటకు వస్తే టీడీపీ, బీజేపీలకు ఇబ్బందినే. అందుకే చంద్రబాబు హస్తినకు వెళ్లనున్నారని తెలుస్తోంది. ఎవరు ఎలాంటి తప్పులేదని భావనను తీసుకువచ్చే ప్రయత్నం చేయనున్నారు. 
దారిలోకి వస్తే సరే. లేకపోతే బీజేపీకి రాం రాం చెప్పే ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు. గతంలో మాటలను  కట్టడి చేసిన టీడీపీ ఇప్పుడు తప్పు అంతా బీజేపీదేనని వాదిస్తోంది. అందుకే ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. అదే సమయంలో అసెంబ్లీ సీట్ల పెంపుపై చంద్రబాబు చివరి యత్నం చేస్తారని చెబుతున్నారు. పార్టీ ఫిరాయింపులు, ఓటుకు నోటు కేసు, ఏపీ నిధుల ఖర్చు లెక్కల విషయంలో చంద్రబాబు కేంద్రం చేతిలో చిక్కుకున్నారనే అభిప్రాయం ఉంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*