కేటీఆర్, హరీష్ రావు కొడుకుల మధ్య పోరు

కేసీఆర్ కుమారుడు కేటీఆర్. కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు. రాజకీయంగా మాస్ ఫాలోయింగ్ ఉన్న నేత హరీష్ రావు. ఇంగ్లీష్ లో దంచికొట్టడం కేటీఆర్ కు తెలిసినట్లు హరీష్ రావుకు తెలియదు. కానీ పల్లె సీమల్లో హరీష్ రావుకు ఉన్న పట్టు కేటీఆర్ కు లేదు. ఎవరికి వారే తిరుగులేని నేతలు. కానీ కేటీఆర్ కు ఇచ్చిన ప్రయార్టీ హరీష్ రావుకు కేసీఆర్ ఇవ్వడనేది నిజం. అయినా సరే ఏనాడు కేసీఆర్ ను పల్లెత్తు మాట అనలేదు హరీష్ రావు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ పథకాలు హరీష్ రావు వల్లనే సక్సెస్ అయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే కాదు.. ట్రంప్ కుమార్తె ఇవాంక వచ్చినప్పుడు హవా అంతా కేటీఆర్ దే. ఆ సమయంలో అసలు రాష్ట్రంలోనే లేకుండా వెళ్లారు హరీష్ రావు. 
బయటకు చెప్పక పోయినా లోపల ఇరువురి మధ్య పచ్చ గడ్డి వేయక పోయినా మండిపోయేంత వైరం ఉందంటారు. కానీ మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని మీడియా ముందు చెప్పడం కొత్తేం కాదు. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు వారిద్దరు కుమారులకు పడటం లేదట. ఈ విషయాన్ని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పే వరకు మిగతా వారికి తెలియదు. 
ఇది ఆశ్చర్యకమైన వార్తనే. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్ష్ తన స్నేహితులతో కలిసి వెళ్లారట. అదే మ్యాచ్ కు హరీష్ రావు కుమారుడూ వెళ్లారు. తాను కూర్చున్న లాంజ్ లోకి ఎలా వస్తావంటూ హరీశ్ రావు కుమారుడిని కేటీఆర్ కుమారుడు ప్రశ్నించాడు. అంతే కాదు.. బయటకు వెళ్లగొట్టాడనేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన మాట. పెద్దలే కాదు… పిల్లల దాకా వారసత్వ వర్గపోరు నడుస్తోందని చెప్పారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయనడానికి ఈ ఉదాహరణ చెబుతున్నట్లు కోమటిరెడ్డి ప్రస్తావించారు. 
ఆ గొడవ సంగతి తాత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిసినా ఎటువైపు చెప్పాలో అర్థం కాక మౌనం దాల్చారంటున్నారు. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు బొడ్డపల్లి శ్రీనివాస్ ను ఎమ్మెల్యే వీరేశం అనుచరులు హతమార్చారనే ఆరోపణలు వచ్చాయి. అది నిజం కాదని మంత్రి జగదీష్ రెడ్డి వాదించారు. అసలు మంత్రికి ఏం తెలుసు. వారింట్లోనే కేటీఆర్, హరీష్ రావు కొడుకులు కొట్టుకుంటున్నారంటూ అసలు విషయం చెప్పేశాడు కోమటిరెడ్డి. దీంతో అంతటా ఇదే విషయంపై చర్చ సాగుతోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*