తెలుగులో ఎంట్రీ ఇవ్వనున్న ఎయిర్ టెల్ లేడీ

ఎయిర్ టెల్ లేడీ గుర్తుందా. 3జీ, 4జీ అంటూ ప్రజల ముందుకు వచ్చి పలకరిస్తోంది. లలితా జ్యూయలర్స్ కంటే ఎక్కువగా రోజు టీవీల్లో కనపడిందామె. ఆ తర్వాత గుండు బాస్ ( కిరణ్, లలితా జ్యూయెలర్స్) దెబ్బకు ఎయిర్ టెల్ యాడ్స్ తగ్గాయి. అయినా సరే తగ్గలేదు. ఆ కమర్షియల్‌ యాడ్ లో కనిపించిన భామ పేరు సాషా చెత్రి. జార్ఖండ్‌కు చెందిన అమ్మాయి. మోడల్‌గా, మ్యూజిషియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడీ ఈ బ్యూటీ త్వరలోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. రోజు టీవీలో ఆమె ఫేస్ చూసిన దర్శకుడు సాయి కిరణ్ అడివికి నచ్చిందట. అందుకే ఆమెనే హీరోయిన్ గా పెట్టి సినిమా తీసేందుకు సిద్దమయ్యారు. సాషాను పిలిచి మరీ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. వినాయకుడు, కేరింత ఫేం దర్శకుడు సాయి కిరణ్. గతంలో ఆమె ఏ సినిమాల్లో నటించలేదు. ఈ మూవీ కోసమే సాషా హైదరాబాద్‌లో శిక్షణ తీసుకుంటోంది. 
త్వరలోనే ఈ సినిమాను ప్రారంభించనున్నారు. హీరోయన్ ను తీసుకున్నప్పటికీ ఇంకా హీరో ఎవరని తీసుకోలేదు. యంగ్ హీరోను ఇందుకు ఎంపిక చేసేందుకు సిద్దమయ్యారు. ఇప్పుడు ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయి. టీవీతో పాటూ సోషల్ మీడియాలోనూ బాగానే పాపులర్ అయిన సాషా చూసేందుకు చాలా బాగుంటోంది. ఆమెను ఎయిర్‌టెల్ గర్ల్ అని పిలుస్తారు. తెలుగులో టాలెంట్ ఉన్నప్పటికీ పరభాషా హీరోయిన్లనే ఎంచుకుంటారు ఇక్కడి దర్శకుడు. వారైతే చెప్పింది చెప్పినట్లు చేస్తారు. అన్ని రకాలుగా ప్రయోజనకారి అనేది వారి ఆలోచనట. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*