జనసేన కోసం హీరోల ఎదురు చూపు

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పార్టీలో చేరేందుకు టాలీవుడ్ నటులు చాలా మంది ఎదురు చూస్తున్నారు. హీరో శివ బాలాజీ అన్నయ్యా అంటూ ఎప్పటి నుంచో రంగంలో ఉన్నాడు. బిగ్ బాస్ విజయం తర్వాత మరింతగా జనాల్లో ఆదరణ పొందాడు శివబాలాజీ. బిగ్ బాస్ ను బూతులు తిట్టిన శివబాలాజీని ఎలా విజేతగా ఎంపిక చేశారు ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని ప్రశ్న. ఆయనే కాదు.. నేను తక్కువేం కాదని మొదటి నుంచి చెబుతున్నాడు కమెడియన్ అలీ. పవన్ కల్యాణ్ పక్కన చాలా సినిమాల్లో నటించిన అలీకి పవన్ అంటే అబిమానం. అందుకే పవన్ ఎక్కడుంటే అక్కడ ఉంటారు అలీ. వారే కాదు.. ఈ మధ్య బ్రహ్మీ పేరు తెరపైకి వచ్చింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి బ్రహ్మానందం స్వస్థలం. స్థానిక సంగం థియేటర్ ఏరియాలో ఇరుకుపాలెంల వైపుకు దగ్గరలో ఆయన ఇళ్లు ఉంది. సత్తెనపల్లి శరభయ్యా హైస్కూలు ఆయన విద్యాభ్యాసం సాగింది. గోదావరి జిల్లా అత్తిలిలో ఏడేళ్లు లెక్చరర్ గా పని చేసిన సత్తెనపల్లిలో పోటీ చేసేందుకే ఆయన ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తోంది. 
సత్తెనపల్లిలో అంబటి రాంబాబు పై వందల ఓట్ల తేడాతో స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు గెలిచిన సంగతి తెలిసిందే. తన సొంత నియోజకవర్గం నరసరావుపేటలో ఓడిపోతాననే భయంతో కోడెల సత్తెనపల్లికి మాకామ్ మార్చారంటారు. ఇప్పుడు ఆయన కుమారుడు వసూళ్లు గేటు ఓపెన్ చేశారని ఫలితంగా మరోసారి కోడెల అక్కడ గెలవడం కష్టమనే వాదనుంది. 
వారే కాదు.. హీరో సంపూర్ణేష్ బాబు పవన్ కల్యాణ్ కు తన సంపూర్ణ మద్దతు పలికారు. అన్నయ్య పిలవాలే గానీ పార్టీలో పని చేసేందుకు సిద్దమని చెప్పారు. హీరోయిన్ శివరంజని (ఊహ)ని పెళ్లాడిన హీరో శ్రీకాంత్ ఇప్పుడు జనసేనలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. ప్రజారాజ్యం పార్టీలోనే క్రియాశీలక పాత్ర పోషిద్దామనుకున్నాడు. కానీ ఈ సారి తప్పకుండా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన చేస్తున్నారాయన. ఇందుకు కుటుంబ సభ్యుల మధ్దతు ఉంటుందంటున్నారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ రెండో భార్య విజయ నిర్మల మొదటి భర్త కుమారుడు నరేష్ రాజకీయాల్లోకి రానున్నాడట. కృష్ణ మొదటి భార్య కుమారుడే మహేష్. నరేష్ పుట్టాకనే విజయ నిర్మల కృష్ణ ఇంటికి వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో అనంతపురంలో పోటీ చేసేందుకు ఆయన సిద్దమయ్యాడు. హిందూపురంలో ఇళ్లు తీసుకుని మరీ ఉన్నా.. జనాలు అంతగా పట్టించుకోలేదు. అందుకే ఈసారి పక్కాగా అసెంబ్లీకి పోటీ చేసే ఆలోచన చేస్తున్నారు. 
గతంలో బీజేపీ పక్షాన ఎన్నికైన కోటా శ్రీనివాసరావు ఈ సారి జనసేనలోకి వచ్చే ఆలోచన చేస్తున్నారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి ఏపీ జనాలు విలువ ఇవ్వడం లేదనేది ఆయన వాదనగా ఉంది. ఇక ఎలాగు మెగా హీరోల మద్దతు పవన్ కు ఉండే వీలుంది. కాబట్టి జనసేనలోకి నటుల పరంపర కొనసాగుతోంది. వీరిలో పవన్ ఎవరిని ఆహ్వానిస్తారో మరెవరిని కాదంటారో చూడాలి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*