తొలి ప్రేమ మూవీ రివ్యూ

సినిమా పేరు- తొలి ప్రేమ
నటీ నటులు- వరుణ్ తేజ్, రాశి ఖన్నా, సప్నా పబ్బి,  ప్రియదర్శి. హైపర్ ఆది, సుహాసిని తదితరులు  
కథ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్… అట్లూరి వెంకీ 
నిర్మాత….బీవీఎస్ఎన్ ప్రసాద్ 
సంగీతం…ఎస్ఎస్ థమన్ 
సినిమాటోగ్రఫీ….జార్జి సీ విలియమ్స్ 
ఎడిటింగ్… నవీన్ నూలి
బ్యానర్….శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర 
విడుదల తేది… ఫిబ్రవరి 10
పరిచయ మాటలు…
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన మూవీ తొలి ప్రేమ. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సిినిమా టైటిల్ దీనికి ఎన్నుకున్నప్పుడే అంచనాలు పెరిగాయి. బాగుంటే తప్ప ఆ పేరు పెట్టలేరు అనే టాక్ వచ్చింది. అంతే కాదు… ఫిదా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వరుణ్ తేజ్ అదే స్థాయిలో నటించారనే ప్రచారం ముందుగానే వచ్చింది. అందులోను తొలిసారి వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. దెయ్యాల సినిమాలతో బోరు కొట్టిన తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో వచ్చిన తొలి ప్రేమ ఆకట్టుకుందా..లేదా ఏంటనేది చూద్దాం…
ఇక కథలోకి వెళితే…
ఆది (వరుణ్ తేజ్),వర్ష (రాశి ఖన్నా)లు ట్రైయిన్ లో పరిచయం అవుతారు. అనుకోకుండా వారిద్దరూ హైదరాబాద్ లో ఒకే ఇంజనీరింగ్ కాలేజీలో చేరతారు. అక్కడే చదువుతుంటారు. తొందర్లోనే వారి పరిచయం ప్రేమగా మారింది. కానీ వారిద్దరి లవ్ కు అనుకోని అవాంతరాలు వస్తాయి. ఫలితంగా పలుకారణాలతో విడిపోతారు. ఆ తరువాత హీరో ఆది లండన్ వెళ్ళిపోతాడు. అక్కడే ఉద్యోగం చేస్తుంటాడు. అక్కడే వేరొక అమ్మాయితో లవ్ లో ఉంటాడు. అదే సమయంలో వర్షని మర్చిపోలేకపోతుంటాడు. అనుకోకుడా వర్ష అక్కడకే వస్తోంది. అదే కంపెనీలో జాయిన్ అవుతోంది. వారిద్దరు మళ్లీ కలిశారా..లేదా… ఏం చేశారు. ఎందుకు విడిపోవాల్సి వచ్చింది. చివరకు ఏం జరిగింది..అనేది మిగతా కథ. 
విశ్లేషణ…
మెగా హీరో ఫిదా స్థాయిలో అదరగొట్టాడు. కాలేజీలో హీరో, హీరోయిన్ ల మధ్య సాగే లవ్ సీన్స్ చాలా బావుంటాయి. కథ పాతదే. కానీకొత్త కోణంలో చూపించాడు వెంకీ. కొన్ని కారణాల వల్ల విడిపోవడం, వారు చివర్లో కలవడం. అందరికీ తెలిసిన కథలే. కానీ స్క్రీన్ ప్లే చాలాబాగుంది. ,హీరో, హీరోయిన్ ల మధ్య లవ్ ట్రాక్ ని డైరెక్టర్ వెంకీ అట్లూరి బాగా నడిపించాడు. కెమెరా వర్క్ అద్భుతమనే చెప్పాలి. సినిమాలో సగం మార్కులు కెమెరాకే వేయాలి. అంతగా ఆకట్టుకున్నాయి విజువల్స్.. ఫస్ట్ ఆఫ్ లో హీరో,హీరోయిన్ ల మధ్య రొమాంటిక్ లవ్ ట్రాక్ ఆడియన్స్ నుంచి చప్పట్లు కురిశాయి. తమన్ మ్యూజిక్ బాగుంది. పాటలు చాలా బాగా తీశారు. కాలేజీ నేఫథ్యంలో వచ్చే కామెడీ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఊహించని విధంగా ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ కి ముందు వచ్చే సీన్స్ సెకండాఫ్ పై భారాగా అంచనాలు పెంచాయి.
 
కాకపోతే ఫస్ట్ ఆఫ్ ని చాలా బాగా డీల్ చేసిన వెంకీ సెకండ్ ఆఫ్ లో స్లో అయ్యాడు. తాను అనుకునట్లుగా తీయలేకపోయాడనిపిస్తోంది. ముఖ్యంగా ఆది, వర్షల మధ్య ఎమోషనల్ సీన్స్  సినిమాకు హైలెట్ అనే చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ తో పోలిస్తే సెకండ్ ఆఫ్ కొంచెం డల్ గా ఉంటోంది. సినిమాలో ప్రతి ఫ్రేమ్ లోను కెమెరా వర్క్ బాగుంది. 
నటనట ప్రతిభ….
వరుణ్ తేజ్ మరోసారి లవర్ బాయ్ గా బాగా నటించాడు. న్యూ లుక్  బాగుంది. ఎమోషనల్ సీన్స్ లో ఫిదా అనిపించాడు. ఇక అందాల సుందరి హీరోయిన్ రాశి ఖన్నా కాస్త స్లిమ్ అయింది. చూసేందుకు చిన్న పిల్లల్లా అయింది.  స్లిమ్ లుక్ లో రొమాంటిక్ గా నటించింది. వరుణ్ తేజ్, రాశి ఖన్నాల మధ్య కెమిస్ట్రీ బాగానే కుదిరింది. ఇక రెండో హీరోయిన్ సప్నా పబ్బి పర్వాలేదు. ఇక  ప్రియదర్శి. హైపర్ ఆది, సుహాసిని తదితరులంతా తమ పాత్రలకు బాగానే న్యాయం చేశారు. మొత్తంగా తొలిప్రేమ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అని చెప్పాలి. లవ్ అంటే ఇష్టపడే వాళ్లు తప్పక ఈ సినిమా చూసి ఆనందించవచ్చు. 
ప్లస్ పాయింట్స్
+ వరుణ్ తేజ్, రాశి ఖన్నాల నటన
+ కెమెరా పనితనం
+ కథనం…
+ సంగీతం, పాటలు
మైనస్ పాయింట్స్
సెకండ్ ఆఫ్ బోర్
క్లైమాక్స్
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*