కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారంటే

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తినలో మకాం వేశారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన సతీసమేతంగా ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులుగా పంటినొప్పితో బాధపడుతున్నారు కేసీఆర్. చికిత్స కోసమే ఢిల్లీలో అడుగు పెట్టారని చెబుతున్నా…మరికొన్ని పనులు చేసుకునేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందంటున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ తిరిగి వచ్చే వరకు కేసీఆర్ హస్తినలోనే ఉండనున్నారు. మోడీతో ప్రత్యేక సమావేశం అయ్యాకనే తిరిగి కేసీఆర్ తెలంగాణలో అడుగు పెట్టే వీలుంది. అదే సమయంలో ధనిక రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హామీల గురించి చర్చించనున్నారు. 
 మార్చి 11న తెలంగాణలో నిర్వహించనున్న పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి ప్రధాని మోడీని ఆహ్వానించనున్నారు. తన ఫోటోను పాస్ పుస్తకాల పై వద్దని చెప్పారు కేసీఆర్. రైతుల ఫోటోలు ఉంటే సరిపోతుంది. తనది ఎందుకు. వద్దని చెప్పడం హాట్ టాపికైంది. గతంలో కంటి చికిత్స కోసం ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ పనిలో పనిగా పలువురు నేతలను కలిశారు. ఇప్పుడు పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులను కేసీఆర్ కలవనుండటం ఆసక్తికరంగా మారింది. 
పొత్తుల సంగతి గురించి ప్రధాని మోడీతో కేసీఆర్ చర్చిస్తారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ కంటే తమకు టీఆర్ఎస్ తోనే పొత్తు పెట్టుకుంటే మంచిదనే ఆలోచనలో ఉంది తెలంగాణ బీజేపీ పార్టీ. స్థానిక నేతలు సానుకూలంగా ఉండటంతో పాటు..కేసీఆర్ పెద్దగా బీజేపీని విమర్శించక పోవడంతో పొత్తు కుదిరే వీలున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ మరింత బలంగా మారుతోంది. కేసీఆర్ కు గట్టి పోటీ ఇచ్చే దిశగా కదులుతోంది. అందుకే బీజేపీతో ఒప్పంద చర్చలు జరిపే అవకాశముందంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*