ఆమ్రపాలి పెళ్లి సంగతులు వైరల్

ఆమ్రపాలి. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌. ఆ పేరు ఇప్పుడు మీడియాలో మారుమోగుతోంది. ఆమ్రపాలి పెళ్లి పీటలు ఎక్కనుండటమే ఇందుకు కారణం. ఒక కలెక్టర్ గురించి ఇంతలా మాట్లాడుకుంటున్నారు అంటే కేవలం ఆమె పనితీరునే. తెలుగు సరిగా మాట్లాడలేక పోవచ్చు. కానీ ఆమె చూపే ధైర్య సాహసాలు మాములువి కావు. ఒక అధికారిగా కాకుండా మాములు వ్యక్తిగా ఆమె అందరినీ ఆకట్టుకుంది. ఈ నెల 18న ఆమె ఐపీఎస్ అధికారి సమీర్ శర్మను వివాహం చేసుకోనుంది. వీరి పెళ్లి జమ్మూ కశ్మీర్‌లో అట్టహాసంగా జరగనుంది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన సమీర్ శర్మతో ఆమ్రపాలి ప్రేమలో పడింది. చివరకు అది పెళ్లి పీటల వరకు దారి తీసింది. పెళ్లి తర్వాత ఈ నెల 23న వరంగల్‌, 25న హైదరాబాద్‌లో ఆమ్రపాలి తన సన్నిహితులకు విందు ఇవ్వనున్నారు. ఫలింతగా మీడియాలో ఒకటే హడావుడి. 
ఇప్పుడు ఆమ్రపాలి తన సన్నిహితులకు ఇవ్వనున్న ఆహ్వాన పత్రికను ప్రత్యేకంగా తయారు చేయించారు. ఈ కార్డు చాలా ఖరీదుగా ఉంది. ప్రత్యేక అతిథులకు మాత్రమే ఇచ్చారు. ఆ కార్డు మొదటి పేజీలో పెళ్లికి సంబంధించిన చిత్రాలను క్లాత్‌పై పెయింటింగ్ వేసి అందంగా తీర్చిదిద్దారు. తన సిబ్బంది కోసం ఆమె ఫిబ్రవరి 25న కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో అతిథులకు విందు ఇవ్వనున్నారు. వరంగల్‌కు చెందిన ప్రముఖులను ఆమె ఆహ్వానించారు. పెళ్లికి సంబంధించిన ఆహ్వాన ప్రతికలను రెండు రకాలుగా ప్రింట్ చేయించారు. ప్రముఖులకు ఖరీదైన కార్డు, మిగతావారికి మామూలు కార్డులను ప్రింట్ చేయించడం విశేషం. వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి పెళ్లి సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఈనెల 26 నుంచి మార్చి 7 వరకు భర్త సమీర్‌తో కలిసి ఆమ్రపాలి టర్కీ పర్యటన వెళ్లనున్నట్టు అప్పుడే ప్రచారం వచ్చింది. 
వైజాగ్ అమ్మాయి.. కశ్మీర్ అబ్బాయి
2010 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆమ్రపాలికి ఢిల్లీలో పరిచయం అయ్యారు సమీర్ శర్మ. ఆయన 2011 ఐపీఎస్‌కు చెందిన వారు. విశాఖ జిల్లాకు చెందిన ఆమె.. ఉత్తరాదికి చెందిన ఈ ఐపీఎస్‌ను పెళ్లి చేసుకోవడం ఆసక్తికరమే. ఐపిఎస్ అధికారి శ్రీనివాస్ ను ఆమె వివాహం చేసుకుంటారనే ప్రచారం తొలిగా వచ్చింది. కానీ అది పుకారేనని తేలింది. సమీర్ శర్మ ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతమైన డయ్యూ ఎస్పీగా పని చేస్తున్నారు. ఆమ్రపాలి తండ్రి విశాఖపట్నానికి చెందిన కాట వెంకటరెడ్డి. ఆయన ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. చిన్నతనం నుంచే చదువులో చురుగ్గా ఉండే వారు ఆమ్రపాలి. ఐఐటీ మద్రాస్ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం బెంగళూరు ఐఐఎం నుంచి పీజీ డిప్లొమా పట్టా అందుకున్నారు. ఐఏఎస్‌ కాకముందు జూనియర్ రిలేషన్‌షిప్ బ్యాంకర్‌గా పని చేశారు. 2010లో సివిల్స్‌ రాసి 39వ ర్యాంక్ సాధించారు. మంచి ర్యాంక్ రావడంతో సొంత రాష్ట్ర కేడర్‌లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు.
2014లో వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి ఆ తర్వాత మహిళా శిశు సంక్షేమ విభాగానికి మారారు. 2016లో కేసీఆర్ ప్రభుత్వం ఆమెను వరంగల్ అర్బన్ కలెక్టర్‌గా నియమించింది. టెక్నాలజీ వాడకంలో ఆమె ముందంజలో ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. యువతకు బాగా దగ్గరయ్యారు. చక్కటి పనితీరుతో తెలంగాణ వ్యాప్తంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. సంప్రదాయ కలెక్టర్‌ హంగు ఆర్భాటాలకు దూరంగా ఉంటూ.. ప్రజలతో మమేకయ్యే ఈ యువ ఐఏఎస్ తెలుగు రాష్ట్రాల యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
రిపబ్లిక్ వేడుకల నాడు తెలుగు సరిగా పలకలేకపోయినా ఇంగ్లీష్ లో దంచికొడుతోంది అమ్రపాలి. అందుకే ఆ సంగతిని లైట్ తీసుకున్నారు జనాలు. అందుకే నమస్తే ఆంద్రా అమెకు బెస్ట్ ఆఫ్ లక్ చెబుతోంది.  

1 Comment

  1. correcte visakahapatnamlo puttiname telegu enduku sarigga matladaleka pothundi. ade mana telugu vari dourbhagyam.ithara rashtralavallu adhikarlaina, nayakulaina sabhalloaina, delhilo aina valla swantha bhashalone matladatharu.

Leave a Reply

Your email address will not be published.


*