చెల్లెమ్మ కవితకు పవన్ ధన్యవాదాలు…

ఏపీకి జరిగిన అన్యాయం పై పార్లమెంట్‌లో ఎంపీలు పోరు సాగించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇదే అంశం హాట్ టాపికైంది. సభలు, సమావేశాలు జరగనీయలేదు. వారి దెబ్బతో చివరకు సభలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ సమస్యలు పరిష్కరించాలని బీజేపీ తప్ప అన్ని పార్టీలు కోరాయి. ఇందుకు తెలంగాణ సిఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత అనూహ్యంగా మద్దతు పలికారు. మా సోదరుల సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని కేంద్రాన్ని కోరారు. లోక్ సభలో ఆమె మాట్లాడారు. విభజనతో ఏపీ అన్ని రకాలుగా నష్టపోయిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజి, రైల్వో జోన్ వంటి అంశాలను పట్టించుకోవాలన్నారు. చివర్లో జై ఆంధ్రా అని నినదించారు. ఫలితంగా కవిత ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. 
ఇది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ కు బాగా నచ్చినట్లుంది. అందుకే కవిత చెల్లెమ్మకు హృదయపూర్వక ధన్యవాదాలని ట్వీట్ చేశాడు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సభలో మాట్లాడిన చెల్లెలు కవిత గారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలని చెప్పారు. ఇది ఇప్పుడు వైరల్ అయింది. ఎంపీ కవితకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. పవన్ ఫ్యాన్స్ కూడా ట్వీట్లు చేస్తున్నారు.
ఎపి సిఎం చంద్రబాబు వల్లనే హైదరాబాద్ ఐటీ అభివృద్ధి చెందిందని కేటీఆర్ అంటే…కవిత ఏపీని ఆదుకోవాలని కోరడం మాములు విషయం కాదు. మొత్తంగా ఏపీ మీద వారికున్న ప్రేమ అనుకోకుండానే బయటపడుతోంది. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రావారిని ఆకట్టుకోవడానికే ఈ తంతు అని కాంగ్రెస్ నేతలు విమర్శించినా..ఆ పని వారు చేయలేదన్నది వాస్తవం. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*