రాయలసీమ కోసం తెలంగాణ వారి ధర్నా

రాయలసీమ కోసం తెలంగాణ న్యాయవాదులు ఆందోళన చేశారు. వారికి తమ మద్దతు పలికారు. ఆంధ్రప్రదేశ్ లో భాగమైన రాయలసీమకు అన్యాయం చేయవద్దని కోరారు. గతంలో తెలంగాణ కోసం ఆందోళన చేసిన న్యాయవాదులు ఇప్పుడు సీమ కోసం ఇంతగా పోరాటం చేయడం ఆశ్చర్యమే. హైకోర్టు విభజన వెంటనే చేస్తామని హామీనిచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ పని చేయలేదు. అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశారు. కాబట్టి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనేది సీమ వాసుల డిమాండ్. 
ఇప్పటికే ఈ విషయం పై డిప్యూటీ సిఎం కేఈ కృష్ణమూర్తి తదితర నేతలు సిఎం చంద్రబాబును కలిసి తమ సంగతి పట్టించుకోవాలని కోరారు. రాయలసీమ వాసులే కొన్నేళ్లుగా ఏపీకి ముఖ్యమంత్రులుగా ఉన్నా ప్రయోజనం లేకపోయిందనే విమర్శ ఉంది. గతంలో నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, దామోదరం సంజీవయ్య, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబునాయుడులు ముఖ్యమంత్రులుగా పని చేశారు. విభజన తర్వాత చంద్రబాబు సిఎంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. పార్టీలు మారినా.. పాలకులు మారినా రాయలసీమకు అన్యాయం జరుగుతుందని నేతలు గట్టిగా వాదిస్తున్నారు. 
గతంలో రాయలసీమ హక్కుల ఐక్యవేదిక అంటూ నినదించిన టిజి వెంకటేష్ లాంటి వారు ఇప్పుడు సీమ గురించి నోరు మెదపడం లేదు. కానీ వైకాపా నేతలు టీడీపీలోకి వస్తే రూ.25 కోట్ల వరకు ఇస్తానని బేరాలు ఆడుతున్నారనే ప్రచారం వస్తోంది. ఫలితంగా టిజి వెంకటేష్ ను పరిగణనలోకి తీసుకోవడం లేదు నేతలు. ఆ తర్వాత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గట్టిగానే తిరిగినా జనాలు పట్టించుకోలేదు. ఆయన చూపు టీడీపీ పై ఉండటంతో ఇక పోరాటం చేసే గట్టి నేతే లేకుండా పోయారంటున్నారు. చిన్న చితకా నేతలు ఉన్నా.. ప్రజల్లో వారికున్న గుడ్ విల్ తక్కువ. అందుకే రాయలసీమ కోసం అక్కడి వాసులే కాదు.. మేము పోరాడతామని చెబుతున్నారు తెలంగాణ న్యాయవాదులు. అందుకే హైదరాబాద్ కేంద్రంగా హైకోర్టు వద్ద రాయలసీమ కోసం ధర్నా చేయడం హాట్ టాపికైంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*