గాయత్రి మూవీ రివ్యూ

రేటింగ్‌ : 2.75/5
నటీ నటులు : మ‌ంచు మోహ‌న్ బాబు, మంచు విష్ణు, శ్రియా శ‌ర‌ణ్, నిఖిలా విమ‌ల్‌, అన‌సూయ‌, బ్ర‌హ్మానందం త‌దిత‌రులు
దర్శకత్వం : మదన్ రామిగాని
నిర్మాత : డా. మోహన్ బాబు ఎం
సంగీతం : ఎస్.ఎస్.తమన్
ఛాయాగ్రహణం : సర్వేశ్ మురారి
క‌ళ‌ : చిన్నా
కూర్పు : ఎం.ఎల్.వర్మ
ఎగ్జిక్యూటివ్ నిర్మాత : విజయకుమార్.ఆర్
పరిచయ మాటలు…
డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాయత్రి. తనకు తోడు కుమారుడు మంచు విష్ణు, శ్రియ జోడీగా నటించారు. అందుకే ‘గాయత్రి’ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ నలుగురు, పెళ్లైయిన కొత్తలో సినిమాలతో మెరిసిన మదన్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. డైమండ్ రత్నబాబు కథ, మాటలు. మోహన్ బాబు మనవరాళ్లు అరియానా, వివియానా, విద్యా నిర్వాణ సమర్పణలో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ బ్యానర్‌పై మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌లో మోహన్‌బాబు నిర్మిస్తోన్న 42వ చిత్రం కావడం విశేషం. చాలా కాలం తర్వాత మోహన్ బాబు తన పవర్ పుల్ డైలాగ్స్ తో అదరగొట్టారనే ప్రచారం జరుగుతోంది. ఫలితంగా ఈ సినిమా పై ఉత్కంఠ నెలకుంది. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం…
ఇక కథలోకి వెళితే…
దాసరి శివాజీ (మోహన్ బాబు) నటుడు. ద్విపాత్రాభినయం. కుర్రోడిగా విష్ణు, వ‌య‌సు మ‌ళ్లిన త‌ర్వాత మోహ‌న్‌బాబు అవతారంలో కనిపిస్తాడు. అత‌ని న‌ట‌నకు ఫిదా అవుతోంది శార‌ద. అది పెళ్లితో శుభం కార్డుపడుతోంది. కానీ శార‌ద తండ్రి మంచిత‌నం వ‌ల్ల ఉన్న ఆస్తుల‌న్నీ కరిగిపోతాయి. శివాజీ మామ చనిపోవడంతో ఇళ్లు జ‌ప్తు చేస్తారు. ఫలితంగా శార‌ద శివాజీతో కలిసి మరో ఇంటికి చేరుతోంది. కష్టాలు రావడంతో శివాజీ తిరిగి న‌ట‌న మీద దృష్టి పెడతాడు. అందరి ప్ర‌శంస‌లు అందుకుంటుంటాడు. అనుకోకుండా శార‌ద ఆరోగ్యం దెబ్బతింటోంది. ఆమె చికిత్స కోసం లక్షల్లో కావాల్సి వస్తోంది. అందుకోసం శివాజీ మరోకరు చేసిన తప్పును తన పైన వేసుకుంటాడు. జైలు పాల‌వుతాడు. అతను జైలు నుంచి వ‌చ్చేస‌రికి అత‌ని భార్య శారదా చ‌నిపోతోంది. పుట్టిన పాప అనాథ ఆశ్ర‌మానికి చేరుకుంద‌ని తెలుసుకుని ఆ పాప కోసం గాలిస్తుంటాడు. కానీ ఎక్కడుందో తెలియదు. 
ఎక్కడో చోట తన బిడ్డ ఉంటుందని ఆలోచించి… అనాథ పిల్ల‌ల కోసం శార‌దా స‌ద‌న్ ను స్థాపిస్తాడు. అనాధాశ్రమాలకు డబ్బులు ఇస్తుంటాడు. అదే సమయంలో త‌ప్పిపోయిన పిల్ల‌ల‌ను కాపాడి వారి త‌ల్లిదండ్రులకు అప్ప‌గిస్తుంటాడు. కొన్ని సార్లు మారు వేషాలు వేస్తూ జైలుకు వెళ్లి రావడం అతనికి అలవాటు అవుతోంది. అప్పుడే గాయ‌త్రీ ప‌టేల్ (పెద్ద మోహ‌న్‌బాబు) ప‌రిచ‌య‌మ‌వుతాడు. శివాజీ, గాయ‌త్రీప‌టేల్ లు ఇద్దరు చూసేందుకు ఒకే ర‌కంగా ఉంటారు. వారిద్ద‌రి మ‌ధ్య ఓ ఒప్పందం కుదురుతుంది. ఆ ఒప్పందంలో శివాజీ మోస‌పోతాడు. గాయత్రీ చేసిన పనికి శివాజీ జైలుకు వెళ్లడం, మోసపోడవం జరుగుతోంది. అనుకోకుండా శివాజీకి తన కుమార్తె సంగతి చేస్తోంది. కూతురుకు మోహన్ బాబు దగ్గరయ్యాడా…లేదా..అసలేం జరిగింది. మ‌ధ్య‌లో శ్రేష్ఠ ఎందుకు వచ్చింది. శివాజీ ఏం చేశాడు…అదే సమయంలో శివాజీ స్నేహితుడు ప్ర‌సాద్‌ని గాయ‌త్రి ప‌టేల్ ఎందుకు చంపించాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
నటనా ప్రతిభ….
కలెక్షన్‌ కింగ్ మోహన్ బాబు రెండు పాత్రల్లోను ఆకట్టుకున్నారు. తానేంటో మరోసారి నిరూపించాడు. వయసు మీద పడుతోంది. తాత అయ్యాడు. ఆ లక్షణాలు నటనలో కనపడుతున్నాయి. నటనలో బాగానే ఉన్నా…డాన్స్, ఫైట్స్ విషయంలో కాస్త తగ్గాడనిపిస్తోంది. విష్ణు తన పాత్రలో ఆకట్టుకున్నాడు. విష్ణు ఏమోషనల్ డైలాగ్స్, నటన కంటతడి పెట్టిస్తాయి. శ్రియ ఇప్పటికీ అందంగా కనిపించింది. కథలో గాయత్రి పాత్రలో నిఖిలా విమల్‌ బాగానే నటించింది. ఇక యాంకర్ అనసూయ జర్నలిస్ట్ పాత్రలో కుదిరింది. ఇక శివ ప్రసాద్‌, పోసాని కృష్ణ మురళీ, రాజా రవీంద్ర, బ్రహ్మానందంలు పర్వాలేదనిపించారు. ఎవరికి వారే తమ పాత్రలకు న్యాయం చేశారు. 
సాంకేతికాంశాలు….
దర్శకుడు మదన్ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మోహన్‌ బాబుకు ఈ కథ బాగా సూటైంది. ఫస్ట్‌ హాఫ్‌లో వేగంగా కథ నడిపించాడు దర్శకుడు.  సెకండాప్ లో కథ నెమ్మదించింది. ఐటమ్‌ సాంగ్‌లు కావాలని పెట్టారు. డైమండ్‌ రత్నబాబు డైలాగ్స్‌ అదిరిపోయాయి. ఇప్పుడున్న రాజకీయాంశాలను శివాజీ పాత్రతో పలికించారు. ఫలితంగా మోహన్ బాబు డైలాగ్స్ కు చప్పట్లు చరిచారు జనాలు. తమన్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్‌, సినిమాటోగ్రఫి బాగానే ఉన్నాయి. లక్ష్మీ ప్రస్నన పిక్చర్స్ నిర్మాణ విలువలు ఎప్పటిలానే బాగున్నాయి. 
ప్ల‌స్ పాయింట్లు
+ మోహ‌న్‌బాబు న‌ట‌న‌
+ విష్ణు, శ్రియ న‌ట‌న‌
+ డైలాగ్ లు 
+ అదిరిపోయిన ఫైట్లు
మైన‌స్ పాయింట్లు
– కామెడీ పండలేదు 
– డాన్స్ సరిగా లేదు
– కొత్త సీసాలో పాత సారా
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*