చంద్రుల‌పైనే.. గెలుపు  భారం!

ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ రాజ‌కీయ వ్యూహాలు ప‌దునెక్కుతున్నాయి.  రాజ‌కీయ‌పార్టీలు పొత్తులు.. ఎత్తుల‌తో అస్త్రశ‌స్త్రాల‌ను సిద్ధం చేసుకునే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యాయి. ఏపీ, తెలంగాణ‌ల్లో విప‌క్ష పార్టీలు.. ఎవ‌రితో క‌లిస్తే.. అధికారం ద‌క్కుతుంద‌నే అంచ‌నాల్లో త‌ల‌మున‌క‌ల‌వు తోంది. తెలంగాణాలో కాంగ్రెస్‌, ఏపీలో వైసీపీ రెండూ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలుగా లెక్క‌లు వేసుకుంటున్నాయి. అధికార పార్టీలు కూడా ఈ రెండింటినే ప్ర‌త్య‌ర్థులుగా భావిస్తున్నాయి. బీజేపీ.. గొప్ప‌లు పోతున్నంత‌గా బ‌లం లేక‌పోయినా ఓట్ల‌ను చీల్చ‌టంలో కీల‌కం కానుంది. ఏపీలో సంప్ర‌దాయ కాంగ్రెస్ ఓట‌ర్లు.. ఈ సారి.. హ‌స్తం వైపు న‌డుస్తారా! సైకిల్ ఎక్కుతారా! జ‌న‌సేన వైపు చూస్తారా.. ఇవేమీ కాదంటే.. అప్ప‌టిక‌ప్పుడు నిర్ణ‌యం తీసుకుంటారా! అనేది ఇప్ప‌టికీ సందిగ్థ‌తే. త‌ట‌స్థ ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేంత‌టి స‌త్తా వున్న నాయ‌కుడెవ‌రు అనేది మ‌రో ప్ర‌శ్న‌. ఏది ఏమైనా.. ఏపీ, తెలంగాణాల్లో ఈ సారి ఎన్నిక‌ల్లోకి వెళ్లేందుకు అధికార పార్టీల‌కు వున్న పెద్ద‌దిక్కు.. ప్ర‌ధాన నినాదం.. ముఖ్య‌మంత్రులే. ఎందుకంటే.. ఉద్య‌మ నేప‌థ్యంతో బంగారుతెలంగాణా అంటుూ ప్రారంభించిన కేసీఆర్‌పైనే ఆశ‌ల‌న్నీ పెట్టుకున్నారు. మ‌రోవైపు న‌వ్యాంధ్ర నిర్మాణ సార‌ధిగా చంద్ర‌బాబు ఒక్క‌రికే సాధ్య‌మ‌నే భావ‌న ఇప్పటికీ ప్ర‌జ‌ల్లో ఉంది. నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో అధికార పార్టీల‌పై వ్య‌తిరేక‌త వున్నా.. ప్ర‌జ‌ల్లో మాత్రం.. ఇద్ద‌రు చంద్రుల‌పై సానుకూల ఆలోచ‌న ఉండ‌టం క‌లిసొచ్చే అంశం. అందుకే.. వ్య‌తిరేక‌త కూడ‌గ‌ట్టుకున్న ఎమ్మెల్యేలు, మంత్రుల‌ను తొల‌గించి కొత్త‌వారికి అవ‌కాశం ఇచ్చేందుకు అధికార పార్టీలు సిద్ధ‌మ‌వుతున్నాయి. దీనివ‌ల్ల ఎటువంటి ఇబ్బందులు త‌లెత్తినా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఇప్ప‌టికే ప‌రోక్షంగా స‌ద‌రు ప్ర‌జాప్ర‌తినిధుల‌కు సంకేతాలు వెళ్లాయి. సీట్ల పెంపు లేక‌పోవ‌టంతో.. అంద‌ర్నీ ఎలా బుజ్జ‌గించాల‌నే అంశంపై ఆరు నెల‌ల ముందుగానే క్లారిటీ తీసుకురావాల‌ని చంద్రులిద్ద‌రూ భావిస్తున్నాయి. పొత్తులు, రాజ‌కీయ వ్యూహాలు.. వీరిద్ద‌రికీ కొత్త‌మీ గాక‌పోయినా.. ఈ సారి మ‌రింత వ్యూహాత్మ‌కంగా వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌నేది మాత్రం వాస్త‌వం.

2 Comments

    • This guy is a paid editor and this is TDP paid website. Everything taste kamma to these folks. Just read the articles, laugh out loud and move on.

Leave a Reply

Your email address will not be published.


*