ఫిబ్ర‌వ‌రిపై మెగా ఆశ‌లు!

మెగా కాంపౌండ్ నుంచి రాబోయే రెండు సినిమాలు.. ఇప్ప‌డు చాలా కీల‌కం. ఎందుకంటే.. తొలిప్రేమ టైటిల్‌తో స‌క్సెస్ కావాల‌ని వ‌రుణ్‌తేజ్ చూస్తున్నాడు. ఎందుకంటే.. ఈ మ‌ధ్యనే ఫిదా స‌క్సెస్‌తో అత‌డిపై అంచ‌నాలు పెరిగాయి. అదీగాకుండా.. అప్ప‌ట్లో తొలిప్రేమ‌తో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇమేజ్‌ను రెట్టింపు చేసుకున్నాడు. టీజ‌ర్ వ‌ర‌కూ బాగానే  ఉందంటూ.. వార్త‌లు వినిపిస్తున్నా.. సినిమా విజ‌య‌మే వ‌రుణ్ కెరీర్‌కు ముఖ్యం కాబోతుంది. వ‌రుస‌గా నాలుగు ప‌రాజ‌యాల‌తో వున్న మ‌రో మెగా హీరో.. సాయిధ‌ర‌మ్ తేజ్ ఆశ‌ల‌న్నీ ఇంటిల్‌జెంట్ పైనే. ఎందుకంటే.. ఈ విజ‌యం అత‌డికి చాలా అవ‌స‌రం. ఒక‌వేళ ఏ మాత్రం తేడాలొచ్చినా.. దాని ప్ర‌భావం తేజూతోపాటు.. ద‌ర్శ‌కుడు వినాయ‌క్‌పై కూడా ఉంటుంద‌నేది గ‌మ‌నించాల్సిన విష‌యం. ఎందుకంటే.. ఖైదీనెంబ‌రు 150 త‌రువాత ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌రో సినిమాపై ఫోక‌స్ చేయ‌ని వినాయ‌క్‌.. ఇంటిల్‌జెంట్ విజ‌యంతో మార్గాన్ని సుగమం చేసుకోవాల్సి ఉంది. అంతేగాకుండా.. మెగా ఫ్యామిలీ త‌రువాత‌.. మ‌రికొంద‌రు హీరోల‌తో సినిమాలు చేసేందుకు వున్న అవ‌కాశాలు మెరుగుప‌డ‌తాయ‌నేది ఫిలింన‌గ‌ర్ అంచ‌నా. మార్చి 30న రాబోయే రంగ‌స్థ‌లంపై కూడా.. ఇద్ద‌రి హీరోల జ‌యాప‌జ‌యాలు ప్ర‌భావం చూపుతాయి. ఇప్ప‌టికే.. సంక్రాంతి బ‌రిలో గంపెడాశ‌లు పెట్టుకున్న అజ్ఞాత‌వాసి.. అంచ‌నాలు అందుకోలేక‌పోయింది. దీంతో.. మెగాభిమానులు నిరాశ‌లో వున్నారు. ఫిబ్ర‌వ‌రిలో అయినా ఆ లోటు భ‌ర్తీ చేస్తార‌ని.. తేజ్ ద్వ‌యం సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. మ‌రి ఈ రెండు బాక్సాఫీసు వ‌ద్ద క‌న‌క‌వ‌ర్షం కురిపిస్తేనే.. మెగా అభిమానులు హ‌ర్షం వ్య‌క్తంచేస్తారు. ఇద్ద‌రు కుర్ర హీరోల‌కు.. వార‌సులుగా మ‌రిన్ని మార్కులు ప‌డే అవ‌కాశాలు మెరుగుప‌డ‌తాయి.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*