చిరంజీవికి రాజ్యసభ ఎర

తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఆ స్థానాల్లో మూడు తెలంగాణకు వెళుతుండగా.. మరో మూడు ఏపీకి దక్కనున్నాయి. మూడు సీట్లలో టీఆర్ఎస్ గెలిచే అవకాశముంది. అలానే ఏపీలో రెండు సీట్లల్లో గెలిచేందుకు టీడీపీ, మరో సీటులో వైకాపాకు చాన్స్ ఉంది. ఇప్పటికే వైకాపా నుండి 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో వైసీపీ నేత ఎన్నిక అంత తేలిక కాదు. మూడో సీటు కోసం టీడీపీ అభ్యర్థిని బరిలోకి దింపనుంది. అదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ చిరంజీవిని పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది టీడీపీ. మంత్రి గంటా శ్రీనివాసరావు ఇందుకు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఉంటే వచ్చే లాభం ఏమి లేదు. అందుకే టీడీపీలో చేరితే మంచిదని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఎలాగు రాజకీయాలు చేయలేం. కాంగ్రెస్ ను సోనియాగాంధీ బతికున్నంత వరకు ఏపీ ప్రజలు నమ్మేలా లేరు. అందుకే కాంగ్రెస్ ను వీడేందుకు చిరంజీవి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. 
మీరు ఓకే అంటే నేను మా బాస్ ( చంద్రబాబు)తో మాట్లాడతానని ఆ మంత్రి తెగ ఒత్తిడి తెస్తున్నారట. అయినా సరే ఇంకా చిరు నుంచి క్లారిటీ రాలేదు. ఇప్పుడు పార్టీ మారితే ఎంపీ సీటు కోసమే అనే ప్రచారం వస్తోంది. అది రావడం తనకు ఇష్టం లేదంటున్నారాయన. ప్రజారాజ్యం పార్టీ పెట్టి నడపలేక చేతులెత్తేశారు చిరంజీవి. అందుకే ఏకంగా ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరు సోదరుడు పవన్ కల్యాణ్ జనసేన పెట్టి ప్రజల్లోకి వెళుతున్నాడు. టీడీపీ అధినేత చంద్రబాబు పై ఈగ వాలనీయడం లేదు ఆయన. అందుకే అన్నయ్య, తమ్ముడు సినిమాల్లోని హీరోలు, నిజ జీవితంలో అన్నదమ్ముళ్లు అనుబంధంతో ఒకే పార్టీలో ఉంటే మేలని ఆలోచిస్తున్నారని సమాచారం. ఏదైనా త్వరలోనే దీని పై కీలక నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*