సరదా వ్యాఖ్యలపై చౌకబారు పంచాయతీలా?

తెలుగుజాతికి అన్న నందమూరి తారక రామారావు …. ఒకప్పట్లో అమెరికాలో తెలుగువారి వైభవాన్ని గమనించి.. ఏదో ఒకనాటికి అమెరికాను కూడా తెలుగువాడు పరిపాలించే రోజు వస్తుందని వ్యాఖ్యానించారని పెద్దలు చెబుతూ ఉంటారు. అది కేవలం ప్రవాసంలో తెలుగుజాతిలో స్ఫూర్తి నింపడానికి చెప్పే మాట తప్ప.. మరొకటి కాదని కాస్తంత బుర్ర ఉన్న ఎవరైనా అర్థం చేసుకుంటారు.

అదే తరహాలో.. తెలుగువారి అపూర్వ స్పందన, వెల్లువలా వస్తున్న తెలుగుదేశం కార్యకర్తల ఉత్సాహాన్ని అభినందించడానికా అన్నట్లుగా.. ‘మిమ్మల్ని చూస్తోంటే.. అమెరికాలో కూడా మనం అధికారంలోకి వస్తామేమో అనిపిస్తోంది’’ అని లోకేష్ ఏదో సరదాగా వ్యాఖ్యానించారు. అలాంటి సరదా వ్యాఖ్యను పట్టుకుని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నానా రాద్ధాంతం చేసేస్తున్న తీరు.. తెలుగుదేశం అభిమానులు మాత్రమే కాదు.. తటస్థులకు కూడా కంపరం పుట్టిస్తోంది.

రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నారై వర్గాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించడం, ఎన్నారైల్లో వదాన్యులను ఆంధ్రప్రదేశ్ సంక్షేమ, సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా మాట్లాడడం వంటి అంశాలు ఎజెండాగా లోకేష్ యాత్ర సాగుతోంది. అమెరికాలోని వేర్వేరు ప్రాంతాల్లో పర్యటిస్తున్న లోకేష్ కు అక్కడి తెలుగువారి నుంచి ఘనంగా స్పందన లభిస్తోంది. న్యూజెర్సీలో అయితే బహిరంగ సభను తలపించే రీతిలో చాలా పెద్ద సంఖ్యలో తెలుగువారు కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంత భారీ స్పందనను ఊహించని.. లోకేష్.. ఆ ఆనందంలో సరదాగా .. ‘‘మీస్పందన చూస్తోంటే అమెరికాలో కూడా మనం అధికారంలోకి వస్తామేమో అనిపిస్తోంది’’ అన్నారు.

అచ్చంగా అదేదో సీరియస్ ట్రంప్ కు లోకేష్ హెచ్చరిక చేసిన స్థాయిలో సాక్షి దినపత్రిక ఆ వ్యాఖ్యలను హైలైట్ చేసింది. నారా లోకేష్ అవగాహన లేకుండా మాట్లాడారని ఎలా పడితే అలా చిలవలు పలవలు పేర్చి కథనాన్ని వండి వార్చింది. స్వామిభక్తి పరాయణులైన వైఎస్సార్ సీపీ నాయకులు కూడా దాన్ని అందుకుని రెచ్చిపోయారు. వాస్తవంలో న్యూజెర్సీలో జరిగినదేమిటో ఎవ్వరికీ తెలియదు గానీ.. సాక్షి వండిన కథనాన్ని నమ్ముకుని.. ఎలాంటి అవగాహన లేకుండా.. అమెరికాలో లోకేష్ మన పరువు తీసేస్తున్నాడంటూ వైకాపా నాయకులు విషయం తెలియకుండానే గొంతులు చించుకుని నవ్వుల పాలయ్యారు. సరదాగా చేసిన కామెంట్ నుకూడా రచ్చ రచ్చ చేయడానికి.. ఏదో ఒక రకంగా లోకేష్ మీద బురద చల్లడానికి జగన్ అండ్ కో పడుతున్న తాపత్రయం చూస్తే జాలి కలుగుతున్నదనం ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

1 Comment

  1. Lokesh Sarada comments
    1) Donot vote for TDP (He cmmented in one of meeting)
    2) During Ambedkar jayanti he says as As death day
    like so many comments he done

Leave a Reply

Your email address will not be published.


*